World’s Tallest Bridge | ప్రపంచంలోనే ఎత్తయిన వంతెన.. నిర్మాణానికి 2 వేల కోట్లు
అద్భుత నిర్మాణాలతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న చైనా త్వరలో మరో ఇంజినీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించనున్నది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ బ్రిడ్జిని ఈ జూన్‌లో ప్రారంభించనున్నది.
- 2,400 కోట్లతో నిర్మించిన చైనా
- ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్ కంటే 200 మీటర్ల్ల అధిక ఎత్తు
- గంట ప్రయాణం నిమిషంలో పూర్తి
బీజింగ్, ఏప్రిల్ 13: అద్భుత నిర్మాణాలతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న చైనా త్వరలో మరో ఇంజినీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించనున్నది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ బ్రిడ్జిని ఈ జూన్‌లో ప్రారంభించనున్నది. గుయ్‌ఝౌలోని బీపన్ నదిపై 2,050 అడుగుల ఎత్తులో ఈ వంతెనను నిర్మించారు. రెండు మైళ్ల పొడవైన ఈ వంతెన ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే 200 మీటర్లు ఎత్తుగా ఉంటుంది. 2022లో ప్రారంభమైన ఈ వంతెన నిర్మాణం మూడేండ్లలో పూర్తయింది. అందుకు 216 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ.2,427 కోట్లు) ఖర్చయింది.
ఈ వంతెన నిర్మాణానికి దాదాపు 22 వేల మెట్రిక్ టన్నుల ఉక్కును వినియోగించారు. ఇది మూడు ఈఫిల్ టవర్లకు సమానం. గతంలో హువాజియాంగ్ లోయ చుట్టూ తిరిగి వచ్చేందుకు గంట సమయం పట్టేదని, ఇప్పుడు ఈ వంతెన నిర్మాణంతో ఆ ప్రయాణం నిమిషంలోనే పూర్తవుతుందని చైనా అధికారులు చెప్తున్నారు. చైనా ఇంజినీరింగ్ సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు గుయ్ఝౌను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా మార్చాలన్న లక్ష్య సాధనకు ఈ సూపర్ ప్రాజెక్టు ఊతమిస్తుందని చైనా రాజకీయవేత్త జాంగ్ షెంగ్లిన్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

