న్యూయార్క్: చిన్న వయసులో ఫోన్ ఎక్కువగా వాడే పిల్లల్లో భవిష్యత్తులో అసాధారణ రీతిలో మానసిక సమస్యలు తలెత్తుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
అమెరికా సంస్థ సేపియన్ ల్యాబ్స్ వివిధ దేశాల్లో శాంపిళ్లను సేకరించింది. 2010-2014 మధ్య జన్మించిన వారిలో ఈ సమస్య అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ఆరేండ్లకే ఫోన్లకు అలవాటు పడిన వారిలో 74 శాతం మంది ఈ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నట్టు తేల్చారు.