శకలాల రోదసికి చెక్!

- అంతరిక్ష వ్యర్థాల తొలగింపునకు నవ్య విధానాలు
- మ్యాగ్నటిక్‌తో ఆకర్షించి సంచిలో వ్యర్ధాల సేకరణ
- లేజర్ కిరణాలతో పెద్ద శకలాల భస్మీపటలం
- భూ వాతావరణంలోకి వ్యర్ధాలను నెట్టివేసి మండించడం
- వినూత్న సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్న జపాన్ కంపెనీలు
ప్రపంచ గతిని మార్చేయగల గొప్ప సాంకేతిక ఆవిష్కరణలు .. కాలంతీరే సమయంలో వినాశనానికి కారణభూతులుగా మారే ప్రమాదం లేకపోలేదు. అంతరిక్షంలో రోజురోజుకూ పేరుకుపోతున్న ఉపగ్రహాల వ్యర్థాలను చూస్తే ఇది నిజమేనేమో? అనిపిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున వెయ్యి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఈ శాటిలైట్ల కాలపరిమితి ముగిసిన తర్వాత వాటిని పేల్చేయడంగానీ, లేదా కక్ష్యలో అలాగే వదిలేయడంగానీ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇప్పటివరకూ భూమి చుట్టూ ఉపగ్రహాలకు చెందిన 9 లక్షల చిన్న, పెద్ద వ్యర్థాలు పోగైపోయినట్టు అంచనా. ఇవి సెకనుకు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. వ్యర్థాలు ఈ వేగంతో పనిచేస్తున్న ఉపగ్రహాలను, అంతరిక్ష యాత్రల సమయంలో రాకెట్లను, స్పేస్ స్టేషన్‌ను తాకితే చాలా ప్రమాదకరం. దీనికి శాస్త్రవేత్తలు పరిష్కార మార్గాన్ని వెదుకుతున్నారు. రోదసి వ్యర్థాలను తొలగించడానికి జపాన్‌కు చెందిన మూడు సంస్థలు మూడు విధానాలను రూపొందించాయి. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న వీటితో స్పేస్ జంక్‌ను తొలగించవచ్చని ఆ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఇవి విజయవంతమైతే, భూ పరిధిలోని రోదసి ప్రాంతం వ్యర్థ్ధరహితమవుతుంది.
-నేషనల్ డెస్క్
లేజర్‌తో నామరూపాలు లేకుండా..
వ్యర్ధాలను తొలగించడానికి జపాన్‌కు చెందిన మరో కంపెనీ ‘స్కై పర్ఫెక్ట్ జేశాట్ కార్పొరేషన్’.. ‘లేజర్’ సాంకేతికతను వినియోగించనున్నది. కక్ష్యలో తిరిగే పెద్ద శకలాలను చిన్న ముక్కలుగా (మైక్రో మీటర్ల సైజుకి) చేయడానికి అత్యంత శక్తిమంతమైన లేజర్ కిరణాలను ఉపయోగిస్తారు. అనంతరం, ముక్కలైన వ్యర్ధాలపై పీడనాన్ని కలుగజేస్తారు. దీంతో అవి భూ వాతావరణంలోకి ప్రయాణించి మండిపోతాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రయోగాన్ని 2026లో చేపట్టనున్నట్టు వెల్లడించారు.
ఆకర్షించి సంచిలో వేస్తుంది!
ఉపగ్రహాల వ్యర్ధాలను తొలగించడంలో భాగంగా జపాన్‌కి చెందిన ‘ఆస్ట్రోస్కేల్’ అనే సంస్థ గతనెల 22న రష్యా నుంచి ‘ఈఎల్‌ఎస్‌ఏ-డీ’ అనే ప్రయోగాన్ని చేపట్టింది. రెండు ఉపగ్రహాలు ఉండే ఈ మిషన్‌లో 175 కిలోల బరువున్న ‘సర్వీసర్’ ఉపగ్రహంపై ప్రత్యేకమైన అయస్కాంత వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది ఉపగ్రహ వ్యర్ధాలను ఆకర్షించి.. మిషన్‌కు అనుసంధానించిన సంచిలాంటి నిర్మాణంలో సేకరిస్తుంది. మరో ఉపగ్రహం ‘ైక్లెంట్’ వ్యర్ధాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న సమాచారాన్ని ‘సర్వీసర్’కు చేరవేస్తుంది.
కాలం చెల్లాక.. పని ముగించేస్తుంది
అంతరిక్ష వ్యర్ధాలను తగ్గించడానికి జపాన్‌కు చెందిన మరో కంపెనీ ‘ఏఎల్ఈ’ వినూత్న విధానాన్ని ప్రతిపాదించింది. ఒక ఉపగ్రహాన్ని భూమి నుంచి రోదసిలోకి పంపే ముందే.. ఆ శాటిలైట్‌తో పాటు అప్పటికే ప్రత్యేక ప్రొగ్రామ్ చేసిన ఓ టెధర్ (మరో చిన్న ఉపగ్రహం)ను ప్రధాన ఉపగ్రహానికి అమరుస్తారు. ప్రధాన ఉపగ్రహం జీవితకాలం ముగియగానే ఈ టెధర్ యాక్టివేట్ అవుతుంది. కాలంచెల్లిన శాటిలైట్ దిశను భూ వాతావరణం వైపునకు నెట్టివేస్తుంది. దాంతో ఆ ఉపగ్రహం మండిపోతుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

