Justin Trudeau | మరోసారి మొరాయించిన ట్రూడో అధికారిక విమానం.. నాలుగు నెలల్లో రెండోసారి
Justin Trudeau | కెనడా ప్రధాని (Canada PM) జస్టిన్ ట్రూడో (Justin Trudeau) అధికారిక విమానం మరోసారి మొరాయించింది.
Justin Trudeau | కెనడా ప్రధాని (Canada PM) జస్టిన్ ట్రూడో (Justin Trudeau) అధికారిక విమానం మరోసారి మొరాయించింది. విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో విమానంలో సాంకేతిక సమస్య (plane breaks down) తలెత్తినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు.
ప్రధాని ట్రూడో గతేడాది డిసెంబర్ 26వ తేదీన కుటుంబంతో కలిసి వెకేషన్ కోసం జమైకా (Jamaica) వెళ్లారు. వెకేషన్‌ను ముగించుకొని తిరుగు ప్రయాణానికి ముందు జనవరి 2వ తేదీన విమానంలో భద్రతా అధికారులు సాధారణ తనిఖీలు చేపట్టారు. అప్పుడు విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే కెనడాలోని ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. దీంతో కెనడా నుంచి వెంటనే మరో విమానంలో సాంకేతిక నిర్వహణ బృందాన్ని జమైకాకు పంపించారు. మరమ్మతుల అనంతరం జనవరి 4వ తేదీన ట్రూడో తన అధికారిక విమానంలోనే కెనడా చేరుకున్నారు. కాగా, ప్రధాని అధికారిక విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం నాలుగు నెలల్లోనే ఇది రెండోసారి కావడం గమనార్హం.
కాగా, గతేడాది సెప్టెంబర్‌లో కూడా ట్రూడో విమానం ఇలాగే మొరాయించింది. ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు (G20 Summit) కోసం భారత్ వచ్చిన ఆయన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో రెండు రోజుల పాటూ భారత్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. సదస్సు ముగిసిన తర్వాత ట్రూడో ఢిల్లీ నుంచి కెనడా బయలుదేరాల్సి ఉంది. అయితే, ఆయన ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన సిబ్బంది చివరి నిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేశారు. సుమారు 36 గంటల నిరీక్షణ తర్వాత తిరిగి కెనడా బయలుదేరి వెళ్లారు. ఇలా పలుమార్లు కెనడా అధికారిక విమానాలు ప్రధానిని ఇబ్బంది పెట్టాయి.
Also Read..
Heeralal Nagar | మంత్రిని సన్మానిస్తుండగా కూలిన వేదిక.. 40 మందికి గాయాలు
Bomb threat | ఛత్రపతి శివాజీ మ్యూజియం సహా ముంబైలోని 8 సంస్థలకు బాంబు బెదిరింపులు
Coronavirus | వరుసగా రెండో రోజూ 700కు పైనే కొత్త కేసులు.. నిన్న ఒక్కరోజే 921 మంది డిశ్చార్జ్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

