BRICS | విస్తరించనున్న ‘బ్రిక్స్’.. ఈ గ్రూప్‌లో చేరనున్న మరో ఆరు దేశాలు
BRICS expansion | ఐదు దేశాల కూటమి అయిన ‘బ్రిక్స్’ (BRICS) మరింతగా విస్తరించనున్నది. ప్రస్తుతం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా దేశాలు ‘బ్రిక్స్’లో శాశ్వత సభ్యులుగా ఉన్నాయి. అయితే సభ్య దేశాల సంఖ్యను పెంచాలని ఈ గ్రూప్ నిర్ణయించింది.
కేప్ టౌన్: ఐదు దేశాల కూటమి అయిన ‘బ్రిక్స్’ (BRICS) మరింతగా విస్తరించనున్నది. ప్రస్తుతం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా దేశాలు ‘బ్రిక్స్’లో శాశ్వత సభ్యులుగా ఉన్నాయి. అయితే సభ్య దేశాల సంఖ్యను పెంచాలని ఈ గ్రూప్ నిర్ణయించింది. దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న ‘బ్రిక్స్’ సమ్మిట్‌లో దీని గురించి ప్రధానంగా చర్చించారు. ఈ నేపథ్యంలో బ్రిక్స్ గ్రూప్‌లోకి ఆరు దేశాలను శాశ్వత సభ్యులుగా ఆహ్వానిస్తున్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా తెలిపారు. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, అర్జెంటీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా దేశాలు ‘బ్రిక్స్’ గ్రూప్‌లో చేరుతాయని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ ఆరు దేశాల సభ్యత్వం అమలులోకి వస్తుందని అన్నారు.
కాగా, ‘బ్రిక్స్’ సమ్మిట్‌లో పాల్గొన్న భారత ప్రధాని మోదీ దీనిపై హర్షం వ్యక్తం చేశారు. కొత్తగా ఆరు దేశాలను ఈ గ్రూప్‌లోకి ఆహ్వానించడాన్ని స్వాగతించారు. ఈ ఆరు దేశాలతో భారత్‌కు చాలా సన్నిహిత, చారిత్రక సంబంధాలు ఉన్నాయని తెలిపారు. కొత్త శకం, సహకారం, శ్రేయస్సు కోసం తామంతా కలిసి పని చేస్తామని అన్నారు. ‘బ్రిక్స్’ సమ్మిట్‌లో పాల్గొన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా గ్రూప్ విస్తరణకు మద్దతిచ్చారు.
మరోవైపు ‘బ్రిక్స్’ సభ్యులుగా చేరేందుకు 20కుపైగా దేశాలు ఆసక్తి చూపాయి. శాశ్వత సభ్యత్వం కోసం దరఖాస్తు కూడా చేశాయి. అయితే వీటిలో ఆరు దేశాలను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో 2024 జనవరి 1 నుంచి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, అర్జెంటీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా దేశాలు ‘బ్రిక్స్’ సభ్యత్వం పొంది ఈ కూటమిలో చేరనున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
School Students Fall Ill | తారు ఫ్యాక్టరీ నుంచి కాలుష్యం.. 62 మంది విద్యార్థులకు అస్వస్థత
Cult OTT | 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన విశ్వక్ సేన్ ‘కల్ట్’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
పోచంపల్లి బ్యాంక్‌కు జాతీయ అవార్డు
‘కాకతీయ సేవా సమితి సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకం’
PM Modi | దేశం పేదరికాన్ని జయించింది.. ఫిక్కీ వార్షిక సమావేశంలో ప్రధాని మోదీ..!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

