Rishi Sunak | ప్రధాని రేసు నుంచి తప్పుకోవాలంటూ రిషి సునాక్‌ను కోరిన బోరిస్..!
Rishi Sunak | ప్రధాని లిజ్ ట్రస్(Liz Struss) రాజీనామాతో బ్రిటన్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. బోరిస్ జాన్సన్ రాజీనామా తర్వాత జరిగిన కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో భారతి సంతతికి చెందిన రిషి సునాక్(Rishi Sunak)పై విజయం సాధించిన లిజ్ ట్రస్.. ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. అయితే, తన విధానాలతో అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురవడంతో అధికారం చేపట్టిన 45 రోజులకే అనూహ్యంగా ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
Rishi Sunak | ప్రధాని లిజ్ ట్రస్(Liz Struss) రాజీనామాతో బ్రిటన్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. బోరిస్ జాన్సన్ రాజీనామా తర్వాత జరిగిన కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రిషి సునాక్(Rishi Sunak)పై విజయం సాధించిన లిజ్ ట్రస్.. ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. అయితే, తన విధానాలతో అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురవడంతో అధికారం చేపట్టిన 45 రోజులకే అనూహ్యంగా ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
ట్రస్ రాజీనామాతో రిషి సునాక్(Rishi Sunak) మరోసారి ప్రధాని రేసులో నిలిచారు. ప్రధాని అయ్యేందుకు కావాల్సిన అర్హతలను అందుకున్నారు. ఇప్పటికే ఆయనకు వంద మంది ఎంపీలు మద్దతు ఇచ్చారు. అయితే, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్(Boris Johnson ) మరోసారి ఆ పోస్టుపై కన్నేసినట్లు తెలుస్తోంది. కరీబియన్ దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న బోరిస్.. హుటాహుటిన మళ్లీ బ్రిటన్‌కు బయలుదేరారు. ప్రధాని రేసునుంచి తప్పుకోవాలంటూ రిషి సునాక్‌ను కోరినట్లు సమాచారం. కష్టకాలంలో పార్టీని కాపాడుకోవడం చాలా ముఖ్యమని.. ప్రధాని రేసు నుంచి తప్పుకుని తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.
పార్టీ నాయకత్వాన్ని చేపట్టాలన్నా, లేక ప్రధాని కావాలన్నా.. కనీసం వంద మంది ఎంపీలు మద్దతు తెలపాలి. ప్రస్తుతం ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్‌కు వంద మంది ఎంపీలు మద్దతిచ్చారు. ఇక, బోరిస్ జాన్సన్‌కు ఇప్పటి వరకు 44 మంది మద్దతు ఇవ్వగా… పెన్నీ మోర్డాంట్‌కు 21 మంది మద్దతు ఉంది. అయితే ఇప్పటి వరకు సునాక్, జాన్సన్ అధికారికంగా ప్రచారం మొదలుపెట్టలేదు. కానీ వాళ్లకు మాత్రం టోరీ పార్టీ ఎంపీలు మద్దతు ముందే ప్రకటించారు. ముగ్గురిలో రిషి సునాక్‌కు ఎక్కువ మంది మద్దతు లభించడంతో.. ఆయన బ్రిటన్ ప్రధాని రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

