ఫ్లోరిడా: బిలియనీర్ జెఫ్ బేజోస్‌కు చెందిన బ్లూ ఆర్జిన్(Blue Origin) కంపెనీ అంతరిక్ష ప్రయోగాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ కంపెనీ చేపట్టిన న్యూ గ్లెన్ రాకెట్ పరీక్ష విఫలమైంది. ఫ్లోరిడాలోని కేప్ కెనరవల్ లాంచ్ ప్యాడ్‌లో గ్లెన్ రాకెట్ పేలింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఆ కంపెనీ వెల్లడించింది. హాట్‌ఫైర్ పరీక్ష సమయంలో లోపాలు తలెత్తాయని ఆ కంపెనీ తన స్టేట్మెంట్లో పేర్కొన్నది. బ్లూ ఆర్జిన్ ప్రత్యర్థి స్పేస్ ఎక్స్ కంపెనీ ఆ ప్రమాదం పట్ల సంతాపం తెలిపింది. దురదృష్టకరమైన ఘటన అని వెల్లడించింది. ప్రయోగ సమయంలో రాకెట్ కింద భాగం నుంచి పొగ వచ్చినట్లు ఓ వీడియోలో కనిపించింది. సుమారు 98 మీటర్ల ఎత్తు ఉన్న ఆ రాకెట్ భారీ స్థాయిలో పేలుడంతో ఫైర్‌బాల్ ఏర్పడింది.
బేజోస్ ఈ ఘటనపై స్పందిస్తూ ఏం జరిగిందన్న దానిపై ఇప్పుడే ఏమీ అంచనా వేయలేమన్నారు.కఠినమైన రోజు అని, కానీ అవసరమైన రీతిలో పునర్ నిర్మించుకుంటామన్నారు. ఆర్టెమిస్ మూన్ మిషన్స్ కోసం బ్లూ ఆర్జిన్, నాసా సంయుక్తంగా లూనార్ ల్యాండర్‌ను డెవలప్ చేస్తున్నాయి. నాసా అడ్మినిస్ట్రేటర్ ఐజాక్మాన్ స్పందిస్తూ.. హెవీ లిఫ్ట్ లాంచ్ సామర్థ్యం ఉన్న రాకెట్లను డెవలప్ చేయడం అసాధారణ విషయమన్నారు. గత నెలలో కూడా బ్లూ ఆర్జిన్ కి చెందిన గ్లెన్ రాకెట్.. సరైన రీతిలో కమ్యూనికేషన్ శాటిలైట్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టేలకపోయింది. ఆ ఘటనపై దర్యాప్తు సాగుతోంది.
All personnel are accounted for and safe. It’s too early to know the root cause but we’re already working to find it. Very rough day, but we’ll rebuild whatever needs rebuilding and get back to flying. It’s worth it.
— Jeff Bezos (@JeffBezos) May 29, 2026