సెప్టెంబర్ నాటికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ

వాషింగ్టన్ : ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న యుద్ధానికి అమెరికా ఫుల్స్టాప్ పెట్టనున్నది. ఆ దేశంలో ఉన్న తమ సైనిక బలగాలను సెప్టెంబర్‌లోగా ఉపసంహరించనున్నట్లు అమెరికా చెప్పింది. అమెరికాపై ఉగ్రదాడి జరిగి 20 ఏళ్లు కావస్తున్న తరుణంలో.. ఆఫ్ఘన్ నుంచి తమ దళాలను వెనక్కి రప్పించనున్నట్లు బైడెన్ ప్రభుత్వాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్‌లో ఉన్న సుమారు 3500 మంది సైనికులను మే ఒకటో తేదీ నుంచి ఉపసంహరించాలని బైడెన్ సర్కార్ తన ఆదేశాల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నాటికి ఆ ప్రక్రియ పూర్తి కానున్నది. 2001లో విధించిన లక్ష్యాలను అమెరికా చేరుకున్నట్లు బైడెన్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. దళాల ఉపసంహరణపై బైడెన్ త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. ఆప్ఘనిస్తాన్‌లో తమ సైనికులను దింపిన అమెరికా.. గత 20 ఏళ్ల నుంచి ఉగ్రవాదులతో పోరాడుతూనే ఉన్నది. ఆఫ్ఘన్ యుద్ధాన్ని పర్యవేక్షిస్తున్న నాలుగవ అధ్యక్షుడుగా బైడెన్ నిలుస్తారు. ఈ యుద్ధం కోసం ఆ దేశం ట్రిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. వేలాది మంది సైనికుల్ని కోల్పోయింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

