Obaidul Hassan: బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ హసన్ రాజీనామా
Bangladesh Chief Justice : బంగ్లా చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్.. రాజీనామా చేసేందుకు నిర్ణయించారు. విద్యార్థులు అల్టిమేటమ్ ఇవ్వడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశాధ్యక్షుడికి తన రాజీనామా లేఖను ఆయన సమర్పించనున్నారు.
ఢాకా: బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్(Obaidul Hassan) రాజీనామా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. హసన్ తప్పుకోవాలని ఇవాళ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వాళ్లు అల్టిమేటమ్ జారీ చేశారు. చీఫ్ జస్టిస్‌తో పాటు అపిల్లేట్ డివిజన్ జడ్జీలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాజీనామా చేయాలని విద్యార్థులు హెచ్చరించారు. ఒకవేళ తప్పుకోని పక్షంలో.. వారి ఇండ్లపై దాడులు చేయనున్నట్లు విద్యార్థులు బెదిరించారు. యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూమెంట్ కు చెందిన కోఆర్డినేటర్ హస్నత్ అబ్దుల్లా ఈ అల్టిమేటమ్ జారీ చేశాడు. అయితే జడ్జీల భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని తన పోస్టుకు రాజీనామా చేయనున్నట్లు చీఫ్ జస్టిస్ ఇవాళ జర్నలిస్టులకు తెలిపారు. రాజీనామా చేసేందుకు కొన్ని ఫార్మాల్టీలు ఉన్నాయని, వాటిని పూర్తి చేస్తున్నామని, దేశాధ్యక్షుడు మొహమ్మద్ షాహబుద్దిన్కు రాజీనామా లేఖను పంపనున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన హింస, అల్లర్ల నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లారు. ఆ తర్వాత అక్కడ యునిస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

