Bangkok Pub Fire | థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని ఓ పబ్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు చెలరేగడంతో అందులో చిక్కుకుని 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 63 మంది గాయపడ్డారు. వీరిలో 22 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.
ఆదివారం కావడంతో ఉత్తర బ్యాంకాక్‌లోని నా లాడ్‌ప్రావో పబ్‌కు పెద్ద సంఖ్యలో యువత వచ్చారు. స్టేజీపై కళాకారులు ప్రదర్శన ఇస్తున్న సమయంలో సర్క్యూట్ బ్రేకర్ వద్ద నుంచి పొగ రావడం గమనించారు. అది చూసి అప్రమత్తమయ్యేలోపే భారీ పేలుడు సంభవించి, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. క్షణాల్లోనే మంటలు పబ్ అంతటా వ్యాపించాయి. దీంతో పబ్ లోపల ఉన్నవారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అయితే కరెంటు పోయి చీకటిగా ఉండటంతో పాటు దట్టమైన పొగ వ్యాపించడంతో చాలామంది బయటకు రాలేక అందులోనే చిక్కుకుపోయారు.
అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. సుమారు అరగంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే ఘోర విషాదం జరిగిపోయింది. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువ మంది మృతదేహాలను టాయిలెట్లకు సమీపంలోనే గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
మంటలు, దట్టమైన పొగ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వారు అక్కడికి వచ్చినట్లుగా భావిస్తున్నారు. వారిలో కాలిన గాయాల కంటే పొగ పీల్చడం వల్లే ఎక్కువ మంది మరణించినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు. పబ్ లోపలి పైకప్పునకు అమర్చిన అలంకరణ సామగ్రి మంటలకు ఆహుతి కావడంతో భారీగా విషపూరిత పొగ వ్యాపించిందని.. దానివల్లే ఊపిరాడక వారు చనిపోయినట్లుగా వివరించారు.
💔 27 dead and 18 injured as tragedy strikes Bangkok nightlife
Late last night, a massive fire engulfed the popular entertainment venue "Rong Beer at Ladprao" near the Ladprao Intersection. Emergency services responded around midnight to a fierce blaze, with thick smoke and… pic.twitter.com/vuPsMO7eZn
— Thai Enquirer (@ThaiEnquirer) July 12, 2026