Baby dies in Car | పసి బిడ్డను కారులో వదిలేసిన తండ్రి.. ఏడు గంటల తర్వాత చూడగా మృతి
Baby dies in Car | పది నెలల పసి బిడ్డను తండ్రి కారులో వదిలేశాడు. ఏడు గంటల తర్వాత వచ్చి చూడగా ఆ పాప మరణించింది. (Baby dies in Car) ఈ విషయం తెలుసుకున్న బిడ్డ తల్లి బాధతో అల్లాడిపోయింది.
లిస్బన్: పది నెలల పసి బిడ్డను తండ్రి కారులో వదిలేశాడు. ఏడు గంటల తర్వాత వచ్చి చూడగా ఆ పాప మరణించింది. (Baby dies in Car) ఈ విషయం తెలుసుకున్న బిడ్డ తల్లి బాధతో అల్లాడిపోయింది. పోర్చుగల్‌లో ఈ విషాద సంఘటన జరిగింది. లెక్చరర్ అయిన ఒక వ్యక్తి మంగళవారం పసి బిడ్డతో సహా కారులో ప్రయాణించాడు. మార్గమధ్యలో నర్సరీ వద్ద బిడ్డను అప్పగించడాన్ని అతడు మరిచిపోయాడు. నోవా యూనివర్శిటీ క్యాంపస్‌కు చేరుకున్న తర్వాత కారును పార్క్ చేసి డోర్లు లాక్ చేశాడు. తన కార్యాలయానికి వెళ్లిన అతడు అనంతరం విద్యార్థులకు పాఠాలు చెప్పడంలో బిజీ అయ్యాడు.
కాగా, ఆ వ్యక్తి సుమారు ఏడు గంటల తర్వాత తిరిగి తన కారు వద్దకు చేరుకున్నాడు. కారు డోర్ తెరిచి చూడగా వెనుక సీటులో ఉన్న పది నెలల కుమార్తె అచేతనంగా ఉండటం చూసి షాక్ అయ్యాడు. వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్‌కు ఫోన్ చేశాడు. అక్కడకు చేరుకున్న వైద్య సిబ్బంది ఆ పసి బిడ్డ చనిపోయినట్లు నిర్ధారించారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న తల్లి వెంటనే అక్కడకు చేరుకున్నది. బిడ్డ చనిపోవడాన్ని చూసి బాధతో సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో ఆమెకు వైద్య సపర్యలు చేశారు. కాగా, వెనుక సీటులో ఉన్న పసి బిడ్డ నిద్రపోవడంతో ఆ చిన్నారి విషయాన్ని తండ్రి మరిచిపోయినట్లు ఆ దేశ పోలీసులు తెలిపారు. ఎండ తీవ్రతతోపాటు ఊపిరి ఆడక ఆ పసి పాప మరణించి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

