Taiwan’s new president | చైనా వ్యతిరేకి విలియం లై చింగ్.. తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం
Taiwan's new president William Lai Ching-te | తైవాన్ కొత్త అధ్యక్షుడిగా విలియం లై చింగ్-తే పగ్గాలు చేపట్టనున్నారు. (Taiwan's new president William Lai Ching-te) శనివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు చెందిన అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) ఘన విజయం సాధించింది.
తైపీ: తైవాన్ కొత్త అధ్యక్షుడిగా విలియం లై చింగ్-తే పగ్గాలు చేపట్టనున్నారు. (Taiwan’s new president William Lai Ching-te) శనివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు చెందిన అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) ఘన విజయం సాధించింది. తైవాన్ ప్రధాన ప్రతిపక్ష కోమింటాంగ్ పార్టీ చీఫ్ హౌ యు-ఇహ్ ఎన్నికలలో ఓటమిని అంగీకరించారు. చైనా ప్రాదేశిక వాదనను తిరస్కరించే అధికార డీపీపీ, తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించింది.
కాగా, ప్రమాదకర తీవ్రవాదిగా చైనా ఆరోపించిన ప్రస్తుత ఉపాధ్యక్షుడైన విలియం లై చింగ్ ఈసారి అధ్యక్షుడిగా పోటీ చేసి గెలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని తాము గౌరవిస్తామని తెలిపారు. ‘ ప్రజాస్వామ్యాన్ని మేం ఎంతగా ఆదరిస్తున్నామో ప్రపంచానికి చూపించాం. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలతో మేం నిలబడతాం’ అని అన్నారు. ఈ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు బాహ్య శక్తులు చేసిన ప్రయత్నాలను తైవాన్ ప్రజలు విజయవంతంగా ప్రతిఘటించారంటూ చైనాను పరోక్షంగా విమర్శించారు.
మరోవైపు శాంతిని, తైవాన్ జలసంధి యథాతథ స్థితిని కాపాడటానికి, ద్వీపం రక్షణకు కట్టుబడి ఉన్నట్లు ఎన్నికల ప్రచారం సందర్భంగా విలియం లై చింగ్ తెలిపారు. అలాగే చైనాతో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. కాగా, విలియం లై చింగ్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటే దేశంలో యుద్ధం, అశాంతికి దారితీస్తుందని ప్రతిపక్ష కోమింటాంగ్ ఓటర్లను హెచ్చరించింది. అలాగే తైవాన్ ఆక్రమణకు చైనా సన్నాహాలు చేస్తున్న తరుణంలో ప్రజాస్వామ్యానికి కట్టుబడిన అధికార డీపీపీని ఆ దేశ ప్రజలు మరోసారి గెలిపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

