డాక్యుమెంట్లను చూపకపోతే గ్రీన్‌కార్డ్ హోల్డర్లకు జరిమానా
గ్రీన్ కార్డ్ హోల్డర్లు, నాన్ సిటిజన్స్ ఎల్లవేళలా తమ వద్ద రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్‌ను అందుబాటులో ఉంచుకోవాలని అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) హెచ్చరించింది.
వాషింగ్టన్ : గ్రీన్ కార్డ్ హోల్డర్లు, నాన్ సిటిజన్స్ ఎల్లవేళలా తమ వద్ద రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్‌ను అందుబాటులో ఉంచుకోవాలని అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) హెచ్చరించింది. ఫెడరల్ చట్టాలను అమలు చేసే అధికారులు అడిగినపుడు ఈ పత్రాలను సమర్పించాలని చెప్పింది. వీటిని చూపడంలో విఫలమైన వారికి జరిమానాలు విధిస్తామని స్పష్టం చేసింది.
అమెరికా కోడ్, టైటిల్ 8, సెక్షన్ 1304(ఈ) ప్రకారం, వయసు 18 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ గల ప్రతి నాన్ సిటిజన్ తప్పనిసరిగా తమ అలీన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను లేదా అలీన్ రిజిస్ట్రేషన్ రసీదు కార్డును అన్ని వేళలా అందుబాటులో ఉంచుకోవాలి.
నాన్ సిటిజన్లు అమెరికా చట్టాలను అనుసరించాలని సీబీపీ తెలిపింది. అమెరికాలో రెండో అతి పెద్ద వలసదారుల కమ్యూనిటీగా భారతీయులు ఉన్నారు. వేలాది మంది భారతీయులకు గ్రీన్ కార్డులు ఉన్నాయి. అమెరికా సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) 2024లో వెల్లడించిన సమాచారం ప్రకారం 49,700 మంది భారతీయులు నేచురలైజ్ అయ్యారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CISF | రోజుకు 14-16 గంటల పని.. నాలుగు గంటలే నిద్ర.. ఇదీ సీఐఎస్ఎఫ్ జవాన్ల దుస్థితి
Water Crisis | నీటి సంక్షోభం ముదిరాక సలహాలా?.. ఎల్ నినో హెచ్చరికలున్నప్పుడు మొద్దునిద్ర.. ఇప్పుడు హడావుడి
SC Gurukul | ఎస్సీ గురుకులంలో ముసలం.. ప్రిన్సిపాళ్ల సామూహిక తిరుగుబాటు.. మూకుమ్మడిగా సెలవులు!
Basar IIIT | బాసర ట్రిపుల్ ఐటీకి నీటి కరువు.. నీటి సమస్యతో తరగతులు బంద్
Cyclone Arnab | ‘అర్ణబ్’తో కోస్తాంధ్రకు వణుకు వాతావరణ శాఖ హైఅలర్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

