కెమికల్ ఫ్యాక్టరీపై రష్యా వైమానిక దాడి.. భారీగా విడుదలవుతున్న అమ్మోనియా
chemical plant | ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. సుమీపై రష్యన్ వైమానిక దళం బాంబుల వర్షం కురిపిస్తున్నది. దీంతో నగరం సమీపంలో ఉన్న సుమీఖింపోరమ్ కెమికల్ ప్లాంట్ (chemical plant) నుంచి భారీగా అమ్మోనియా (Ammonia) వాయువు లీకవుతున్నదని
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. సుమీపై రష్యన్ వైమానిక దళం బాంబుల వర్షం కురిపిస్తున్నది. దీంతో నగరం సమీపంలో ఉన్న సుమీఖింపోరమ్ కెమికల్ ప్లాంట్ (chemical plant) నుంచి భారీగా అమ్మోనియా (Ammonia) వాయువు లీకవుతున్నదని గవర్నర్ ఓబ్లాస్ట్ మిత్రో చెప్పారు. దీని ప్రభావం ప్లాంటుకు 2.5 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో కెమికల్ ఫ్యాక్టరీకి సమీపంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వెంటనే అడర్ గ్రౌండ్లలోకి వెళ్లాలని సూచించారు. ఒకవేళ ప్రమాదకరమైన వాయులను గుర్తించినట్లయితే బాత్ రూమ్‌లలో దాచుకోవాలని, వాయువు ప్రభావం తగ్గించడానికి వాటర్ షెవర్లను వినియోగించాలని చెప్పారు.

కాగా, పోర్టు సిటీ అయిన మరియుపోల్‌ను రష్యన్ దళాలు ఆక్రమించుకున్నాయి. పట్టణాన్ని తమకు స్వాధీనం చేయాలని ఉక్రెయిన్‌కు సూచించింది. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ పట్టణాన్ని ఖాళీ చేసేది లేదని ఉక్రెయిన్ ఉప ప్రధాని వరెష్చుక్ స్పష్టం చేశారు. ఆయుధాలను దించే ప్రశ్నేలేదని, ఇప్పటికే ఈ విషయాన్ని రష్యన్ దళాలకు చేరవేశామని వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

