మనిషిని చదివే రోబో

బీజింగ్, జనవరి 9: మనిషి ఆలోచనలను చదివే రోబోను తయారు చేసినట్టు చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. తాము తయారు చేసిన ఇండస్ట్రియల్ రోబో తోటి వర్కర్ల మనసును 96% కచ్చితత్వంతో అంచనా వేస్తుందని తెలిపారు. ఇది కేవలం మెదడు నుంచి వచ్చే తరంగాలనే కాకుండా, కండరాల నుంచి వచ్చే ఎలక్ట్రిక్ సిగ్నళ్లను కూడా గ్రహించి పనిచేస్తుందన్నారు.చైనా త్రీ గోర్జెస్ యూనివర్సిటీ ఇంటెలిజెంట్ మానుఫాక్చరింగ్ ఇన్నొవేషన్ టెక్నాలజీ సెంటర్ శాస్త్రవేత్తలు దీనిని తయారు చేశారు. పరిశ్రమల్లో కార్మికులకు ఇవి సహాయంగా ఉంటాయని, పని మధ్యలో వారికి ఏదైనా వస్తువు అవసరం అయితే రోబోలు వారి ఆలోచనలను గమనించి వెంటనే అందిస్తాయని పేర్కొన్నారు. చైనా పరిశ్రమల్లో రోబోల వినియోగం ఏటా 15% చొప్పున పెరుగుతున్నది. ప్రస్తుతం ప్రతి 10 వేల మంది కార్మికులకు 246 రోబోలు ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- China scientists
- robo
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

