లండన్, అక్టోబర్ 12: చరిత్రలో తొలిసారి ఒక రోబో పార్లమెంట్లో అడుగుపెట్టింది. మంగళవారం యూకే పార్లమెంట్‌లోని హౌజ్ ఆఫ్ లార్డ్స్‌కు వెళ్లిన ఐ-డా(రోబో పేరు).. అక్కడున్న ప్రతినిధులతో మాట్లాడింది. వారి ముందు తన ప్రతిభా పాటవాలను ప్రదర్శించింది. ఈ రోబోను 2019లో ఐడాన్ మిల్లర్ అనే ఇంజినీర్ తయారుచేశారు.