ఫేస్బుక్ సమకూర్చిన విమానంలో.. అధికంగా 155 మంది ఆఫ్ఘన్లు

కాబూల్: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ను తాలిబన్లు ఆగస్ట్ 15న మెరుపు వేగంతో కైవశం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జర్నలిస్టులు, సహాయక సిబ్బంది, ఇతర ప్రముఖులతో కలిపి మొత్తం 188 మందిని కాబూల్ నుంచి అబుదాబి మీదుగా మెక్సికో సిటీకి తరలించేందుకు ఫేస్బుక్, లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ వంటి వారి ఆర్థిక సహకారంతో ఆగస్ట్ 30న ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ విమానం అబుదాబి చేరే సరికి ఊహించని విధంగా 155 మంది ఆఫ్ఘనిస్థాన్‌లు అందులో అధికంగా ఉన్నారు. కామ్ ఎయిర్ సంస్థకు చెందిన ఉద్యోగులు, వారి కుటుంబాలు, మరి కొందరు అందులో ప్రయాణించారు.
ఈ విమానం అబుదాబి చేరిన తర్వాత ఈ విషయాన్ని అక్కడి అమెరికా, యూఏఈ అధికారులు గుర్తించారు. జాబితాలోని లేని 155 మంది ఆఫ్ఘన్ ప్రయాణికులను అబుదాబిలో వదిలేశారు. జాబితాలో ఉన్న 188 మందిని ఈజిప్ట్ ఎయిర్‌కు చెందిన విమానంలో కైరో మీదుగా మెక్సికోకు తరలించారు.
కాగా, ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇలా అక్రమంగా అబుదాబికి పలు విమానాల్లో తరలివచ్చిన ఆఫ్ఘన్ల సంఖ్య 3,600 వరకు ఉంటుందని అమెరికా, యూఏఈ అధికారులు అంచనా వేస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా వచ్చిన వీరి ఇమ్మిగ్రేషన్, భద్రతా విధానాలపై ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ నుంచి తమను సురక్షితంగా తరలించిన ప్రముఖ ప్రైవేట్ సంస్థలకు అబుదాబి చేరిన ఆఫ్ఘన్లు ధన్యవాదాలు చెబుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train Trailer | మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు విజయ్ సేతుపతి.. ఆకట్టుకుంటున్న ‘ట్రైన్’ ట్రైలర్!
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

