Hanuman Murti: అమెరికాలో 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం.. వీడియో
Hanuman Murti: టెక్సాస్‌లో భారీ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. హూస్టన్ సమీపంలో 90 అడుగుల మహా విగ్రహాన్ని ఆవిష్కరించారు. అమెరికా ఆధ్యాత్మిక, సాంస్కృతిక విపణిలో కొత్త మైలురాయి అవుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
హూస్టన్: అమెరికాలోని టెక్సాస్‌లో భారీ హనుమాన్ విగ్రహాన్ని(Hanuman Murti) ఏర్పాటు చేశారు. హూస్టన్ సమీపంలో ఆ మహావిగ్రహాన్ని ఆవిష్కరించారు. 90 ఫీట్ల ఎత్తైన ఆ విగ్రహం.. అమెరికా ఆధ్యాత్మిక, సాంస్కృతిక విపణిలో కొత్త మైలురాయి అవుతుందని పేర్కొన్నారు. హూస్టన్‌లో ఉన్న ఈ విగ్రహం.. ఎన్నో మైళ్ల దూరం నుంచి కనిపిస్తున్నది. అమెరికాలో ఉన్న మూడవ అతిపెద్ద విగ్రహంగా రికార్డు క్రియేట్ చేసింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ(151 ఫీట్లు), ఫ్లోరిడాలోని హల్లండేలా బీచ్‌లో పెగాసస్-డ్రాగన్(110 ఫీట్లు) విగ్రహం తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
సుగర్ ల్యాండ్‌లో ఉన్న అష్టలక్ష్మీ ఆలయంలో హనుమాన్ మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆగస్టు 15 నుంచి 18 వరకు జరిగిన ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో దీన్ని ఓపెన్ చేశారు. సీతా రాములను ఒక్కటి చేయడంలో హనుమంతుడు కీలక పాత్ర పోషించినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. శ్రీ చిన్న జీయర్ స్వామిజీ చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఓపెనింగ్ కార్యక్రమం సమయంలో హెలికాప్టర్ ద్వారా పువ్వులు, పవిత్ర జలాన్ని చల్లారు. హనుమంతుడి మెడలో 72 ఫీట్ల పూలమాలను వేశారు. అమెరికా ఆధ్యాత్మిక, సాంస్కృతిక జగత్తులో ఈ విగ్రహం ఓ మైలురాయిగా నిలుస్తుందని నిర్వాహకులు చెప్పారు.
जय हनुमान जी Big hanuman murti in Texas USA 🇺🇸 🚩🚩
— विजय 🇮🇳 (@bijjuu11) August 21, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

