ట్రక్కులో 46 మృతదేహాలు.. అమెరికాలో దారుణం
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో దారుణం జరిగింది. రైల్వే ట్రాక్ పక్కన ఆగి ఉన్న ఓ ట్రక్కులో 46 మృతదేహాలను వెలికి తీశారు. శరణార్థులను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. శాన్ ఆంటోనియో పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మెక్సికో బోర్డర్‌కు సుమారు 250 కిలోమీటర్ల దూరంలో శాన్ ఆంటోనియో నగరం ఉంది. అయితే ఇటీవల అక్కడ భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సుమారు వంది మంది వలసదారుల్ని ట్రక్కులో అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే వేడి వాతావరణం వల్ల ఊపిరి ఆడక చాలా మంది చనిపోయినట్లు భావిస్తున్నారు. 18 టైర్లు ఉన్న ట్రక్కులో మానవ రవాణా జరిగినట్లు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ముగ్గుర్ని అరెస్టు చేశారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో ట్రక్కును గుర్తించారు. ఓ వ్యక్తి ట్రక్కు బయట చనిపోయి ఉండగా.. ట్రక్కులో మరికొన్ని శవాలు దొరికాయి. ఇంకా అనేక మంది హీట్‌వేవ్‌తో ఇబ్బందిపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iodine tablets | ప్రజలకు అయోడిన్ టాబ్లెట్లు పంచుతున్న ఇరాన్.. ఎందుకో తెలుసా..?
Niranjan Reddy | ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

