అలస్కా సమీపంలో రష్యా యుద్ధ విమానాలు.. అడ్డుకుని తరిమిన అమెరికా ఫైటర్ జెట్స్
ఈ నెల 13న రష్యాకు చెందిన టీయూ-95 బేర్ హెచ్ బాంబర్లు, సుఖోయ్ 35 ఫైటర్ జెట్లు అలస్కా ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ సమీపంలోకి వచ్చాయని అమెరికా ఎయిర్‌ఫోర్స్ తెలిపింది. దీంతో గాల్లోకి లేచిన తమ యుద్ధ విమానాలు వాటిని అడ్డగించి దారి మళ్లించాయని పేర్కొంది.
వాషింగ్టన్: అమెరికా భూభాగమైన అలస్కా సమీపంలోకి రష్యా యుద్ధ విమానాలు వచ్చాయి. గమనించిన అమెరికా ఎయిర్‌ఫోర్స్ తన ఫైటర్ జెట్స్‌ను రంగంలోకి దించింది. గాల్లోకి లేచిన అమెరికా ఫైటర్ జెట్లు రష్యా యుద్ధ విమానాలను అడ్డుకుని తరిమాయి. నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ ఈ విషయం తెలిపింది. మంగళవారం ఈ మేరకు ట్విట్టర్లో ఒక పోస్ట్ చేసింది. ఈ నెల 13న ఈ సంఘటన జరిగినట్లు చెప్పింది. రష్యాకు చెందిన టీయూ-95 బేర్ హెచ్ బాంబర్లు, సుఖోయ్ 35 ఫైటర్ జెట్లు అలస్కా ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ సమీపంలోకి వచ్చాయని తెలిపింది. దీంతో గాల్లోకి లేచిన తమ యుద్ధ విమానాలు వాటిని అడ్డగించి దారి మళ్లించాయని పేర్కొంది.
కాగా, రష్యా యుద్ధ విమానాలు అంతర్జాతీయ గగనతలంలోనే ఉన్నాయని అమెరికా ఎయిర్‌ఫోర్స్ తెలిపింది. అమెరికా లేదా కెనడా సార్వభౌమ గగనతలంలోకి అవి ప్రవేశించలేదని పేర్కొంది. అయితే రష్యా ప్రయత్నాలను అడ్డుకునేందుకు తమ విమానాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని వెల్లడించింది. ఈ ప్రాంతంలో రష్యా వాయు కార్యకలాపాలు నిత్యం జరుగుతాయని అమెరికా ఎయిర్‌ఫోర్స్ తెలిపింది. అయితే వీటిని ముప్పుగా లేదా రెచ్చగొట్టే చర్యగా తాము భావించడం లేదని పేర్కొంది. మరోవైపు 2007 నుంచి ఈ జోన్ వద్ద ప్రతి ఏటా సుమారు ఆరేడు సార్లు రష్యా యుద్ధ విమానాలను అమెరికా ఫైటర్ జెట్లు అడ్డుకుంటున్నట్లు ఫాక్స్ న్యూస్ పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

