డెన్మార్క్ షాపింగ్‌మాల్‌లో కాల్పుల మోత.. ముగ్గురు మృతి
Denmark | ఐరోపా దేశం డెన్మార్క్ (Denmark) రాజధాని కోపెన్హగెన్ కాల్పులతో దద్దరిల్లింది. కోపెన్‌హగెన్‌లోని ఫీల్డ్స్ ప్రాంతంలో రద్దీగా ఉన్న ఓ షాపింగ్ మాల్లో దూరిన ఆగంతకుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు.
కోపెన్హగెన్: ఐరోపా దేశం డెన్మార్క్ (Denmark) రాజధాని కోపెన్హగెన్ కాల్పులతో దద్దరిల్లింది. కోపెన్‌హగెన్‌లోని ఫీల్డ్స్ ప్రాంతంలో రద్దీగా ఉన్న ఓ షాపింగ్ మాల్లో దూరిన ఆగంతకుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. కాల్పుల శబ్ధాలు విన్న జనాలు అక్కడి నుంచి పరుగులు తీశారని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.
కాగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. షాపింగ్‌మాల్‌ను చుట్టుముట్టారు. ఆదివారం సాయంత్రం 5.37 గంటల సమయంలో మాల్లో కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటన అనంతరం 11 నిమిషాల్లోనే 22 ఏండ్ల వయస్సు కలగిన అనుమానితుడిని అరెస్టు చేశామన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

