America | అమెరికాలో భారత సంతతి విద్యార్థి దారుణ హత్య
America | అగ్రరాజ్యం అమెరికా (America) లో భారత సంతతి విద్యార్థి (Indian-Origin Student) దారుణ హత్యకు గురయ్యాడు. ఫిలడెల్ఫియా (Philadelphia) లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు.
America | అగ్రరాజ్యం అమెరికా (America) లో భారత సంతతి విద్యార్థి (Indian-Origin Student) దారుణ హత్యకు గురయ్యాడు. ఫిలడెల్ఫియా (Philadelphia) లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఖలీజ్ టైమ్స్ (Khaleej Times ) వెల్లడించిన వివరాల ప్రకారం..
21 ఏళ్ల జూడ్ చాకో (Jude Chacko) ఓ వైపు చదువుకుంటూనే పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఆదివారం (స్థానిక కాలమానం ప్రకారం) పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జూడ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు తల్లిదండ్రులు కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన వారు. 30 ఏళ్ల క్రితమే వారు యూఎస్‌కు వలస వెళ్లారు.
యూఎస్‌లో భారతీయ సంతతికి చెందిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని హత్య చేయడం ఈ ఏడాది ఇది రెండో ఘటన. దీంతో అమెరికాలోని భారతీయుల్లో ఆందోళన నెలకొంది. ఏప్రిల్ 21వ తేదీన అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల విద్యార్థి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఓహోయోలోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న సాయూశ్ వీరపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఆ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు.
Also Read..
Bangalore | బెంగళూరులో పంక్చర్ మాఫియా ఆగడాలు.. రోడ్డెక్కాలంటేనే భయపడిపోతున్న ప్రజలు
MS Dhoni | ధోనీ మరో ఘనత.. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డు
Rahul Gandhi | ట్రక్కు డ్రైవర్లతో ఆసక్తికరమైన సంభాషణ.. వీడియో షేర్ చేసిన రాహుల్ గాంధీ
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

