Canada | వాంకోవర్: కెనడాలోని కాల్గరీ, వాంకోవర్ నగరాల మధ్య దూరం దాదాపు 700 కిలోమీటర్లు. వాంకోవర్ పట్టణంలో ఇంటి అద్దెలను చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎంతలా అంటే భారీగా ఉండే అద్దెను చెల్లించడం కంటే ఓ విద్యార్థి విమానంలో వెళ్లి తరగతులకు హాజరవడమే నయం అనుకొనేలా పరిస్థితి ఉన్నది. వారానికి రెండు సార్లు విమానంలో కాల్గరీ నుంచి వాంకోవర్కు ప్రయాణిస్తున్న యూనివర్సిటీ ఆఫ్ కొలింబియా (యూబీసీ)కి చెందిన టిమ్ చెన్ అనే విద్యార్థి ప్రస్తుతం మీడియాలో హైడ్లైన్స్లో నిలిచాడు.
వాంకోవర్లో సింగిల్ బెడ్రూమ్ ఇంటికి దాదాపుగా రూ.1.74 లక్షలు వెచ్చించాల్సి వస్తుండగా.. అదే ఒక రౌండ్ విమాన ప్రయాణానికి 150 డాలర్ల చొప్పున నెలకు ఎనిమిది ట్రిప్పులకు రూ.99 వేలు మాత్రమే ఖర్చు అవుతున్నదని టిమ్ చెన్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకొన్నారు.
టిమ్ పోస్టుపై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. దీని వల్ల చాలా సమయం వృథా అవుతుందని ఒకరు పేర్కొనగా, ఆధునిక సమస్యలకు ఆధునిక పరిష్కారమంటూ మరో యూజర్ అభిప్రాయపడ్డారు.