రక్షణ బడ్జెట్‌ను పెంచిన చైనా

బీజింగ్ : భారత్‌తో సరిహద్దుల్లో ఉద్రిక్తల వేళ చైనా తన రక్షణ బడ్జెట్‌ను 209 బిలియన్ డాలర్లకు పెంచింది. గతేడాదితో పోలిస్తే 6.8శాతం అధికంగా నిధులను కేటాయించింది. ఈ మేరకు రక్షణ బడ్జెట్‌పై చైనా పార్లమెంట్లో ప్రధాని లీ కేఖియాంగ్ ప్రకటన చేశారు. అయితే రక్షణ బడ్జెట్ పెంపును డ్రాగన్ దేశం సమర్థించుకుంది. తమ జాతీయ భద్రతను పటిష్టతే లక్ష్యమని పేర్కొంది. ఏ దేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం, బెదిరింపులకు దిగడం లేదని చైనా ప్రతినిధి పేర్కొన్నారు. గతేడాది చైనా 1.268 ట్రిలియన్ యువాన్ల (సుమారు 196.44 బిలియన్ డాలర్లు)ను కేటాయించింది. గత ఆరు సంవత్సరాలుగా రక్షణ రంగానికి చైనా అధిక నిధులు కేటాయిస్తూ వస్తోంది. ఈ ఏడాదిలో 1.35 ట్రిలియన్ యువాన్లు ( సుమారు 209 డాలర్లు) వెచ్చించనుంది. చైనా రక్షణ బడ్జెట్ అమెరికా బడ్జెట్లో నాలుగో వంతు. 2021 ఆర్థిక సంవత్సరానికి అగ్రరాజ్యం 740.5 బిలియన్ డాలర్లు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా.. 2021లో తలసరి రక్షణ వ్యయం వెయ్యి యువాన్లు (154 డాలర్లు) కంటే తక్కువగా ఉంటుందని ఆ దేశ మీడియా తెలిపింది. బడ్జెట్‌ను ప్రధానంగా సిబ్బంది, శిక్షణ, పరికరాల కోసం వెచ్చిస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

