5నియోజకవర్గాలు.. 58 ప్రభుత్వ దవాఖానలు
మహిళా ఆరోగ్య పథకం మహిళలకు వరంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతి మంగళవారం పలు వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించనుంది. ఇందుకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 58 ప్రభుత్వ దవాఖానల్లో మహిళా ఆరోగ్య పథకం సేవలను త్వరలోనే ప్రారంభించనున్నారు.
- జిల్లాలో త్వరలో ప్రారంభం కానున్న మహిళా ఆరోగ్య పథకం
- ప్రతి మంగళవారం పలు వైద్య పరీక్షలు
- పీహెచ్సీ, యూపీహెచ్సీ, బస్తీ దవాఖానల్లో వైద్య సేవలు..
మేడ్చల్, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ): మహిళా ఆరోగ్య పథకం మహిళలకు వరంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతి మంగళవారం పలు వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించనుంది. ఇందుకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 58 ప్రభుత్వ దవాఖానల్లో మహిళా ఆరోగ్య పథకం సేవలను త్వరలోనే ప్రారంభించనున్నారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని 58 ప్రభుత్వ దవాఖానలను జిల్లా వైద్య శాఖ మొదటి దశలో ఎంపిక చేసింది. మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే పలు రకాల అనారోగ్య సమస్యలకు వైద్యం అందించేందుకు వైద్య సౌకర్యాలను ఎంపిక చేసి పీహెచ్సీ, యూపీహెచ్సీ, బస్తీ దవాఖానల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో మహిళా ఆరోగ్య పథకం వైద్య సేవలను ప్రభుత్వ ఆదేశాల మేరకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే మహిళలకు అందించే వైద్యంపై వైద్యులకు, సిబ్బందికి శిక్షణనిచ్చారు. వైద్య సేవల కోసం వచ్చే మహిళలు ఇబ్బందులు పడకుండా హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఏ ఏ పరీక్షలు చేస్తారు..
మధుమేహం, రక్తపోటు, రక్తహీనత ఇతర సాధారణ పరీక్షలు, ఓరల్ సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్, థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ లోపాలను గుర్తించడం, అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు మిటమిన్ బీ12, విటమిన్ డీ పరీక్షలు చేసి చికిత్స చేసిన తరువాత మందులు అందజేస్తారు. మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్, పెల్విక్ ఇన్ప్లమేటరీ వ్యాధుల పరీక్షలు, మొనోపాజ్ దశకు సంబంధించి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి హర్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతో పాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. నెలసరి సంతాన సమస్యలపై ప్రత్యేక్షంగా పరీక్షలు చేసి వైద్యంతో పాటు అవగాహన కల్పిస్తారు. అవసరమైన వారికి అల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు.
పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలో త్వరలోనే ప్రారంభం కానున్న మహిళా ఆరోగ్య పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి వైద్య పరికరాలను ఎంపిక చేసిన 58 దవాఖానల్లో సమకూర్చుతున్నాం. మహిళలకు పరీక్షల నిర్వహణ అనంతరం అవసరమైన వారికి మందులను అందజేస్తాం. మహిళా ఆరోగ్య పథకం కింద ఎంపిక చేసిన దవాఖానలకు వచ్చే మహిళల వివరాలను ప్రత్యేక యాప్‌లో పొందపర్చనున్నారు. అలాగే గర్భిణులకు న్యూట్రీషియన్ కిట్లను త్వరలోనే అందించనున్నాం. మొదటి దశలో జిల్లా వ్యాప్తంగా 6 ప్రభుత్వ దవాఖానల్లో ప్రారంభించనున్నాం. – – పుట్ల శ్రీనివాస్, వైద్యాధికారి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sowcar Janaki | షావుకారు జానకి కుమార్తెకు ప్రమాదం.. వీల్‌చైర్ నుంచి కిందపడి ఇబ్బందులు..!
Jail Break: ఫిట్స్ వచ్చినట్లు నటించి.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారీ
Radhika Apte | మహిళలకు మహిళలే శత్రువులా … ఉపాసన, రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు..!
Hyderabad | హైదరాబాద్‌లో అర్ధరాత్రి రెచ్చిపోతున్న మందుబాబులు.. గాల్లో దీపంగా అమాయకుల ప్రాణాలు!
మోదీ చట్టంపై అంబానీ, అదానీ ‘యుద్ధం’.. గోప్యతా చట్టంలోని కీలక నిబంధనలపై అభ్యంతరం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

