దశలవారీగా సమస్యల పరిష్కారం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శనివారం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని సప్తగిరి ఎన్‌క్లేవ్‌లో ఆయన పర్యటించి..
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కుత్బుల్లాపూర్, మార్చి 26 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శనివారం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని సప్తగిరి ఎన్‌క్లేవ్‌లో ఆయన పర్యటించి.. సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాల నీలో భూగర్భడ్రైనేజీ, సీసీరోడ్లు, మంచినీటి పైపులైన్, విద్యుత్ స్తంభాల ఏర్పాటును పరిశీలించారు. కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా చర్యలు తీసుంటానని హామీ ఇచ్చారు. ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని నీటిని వృథా చేయకుండా.. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేయాలని పిలుపునిచ్చారు. ఈఈ కృష్ణచైతన్య, వాటర్ వర్క్స్ డీజీఎం రాజేశ్, ఏఈలు సురేందర్‌నాయక్, భానుచందర్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
హనుమాన్ ఆలయంలో పూజలు
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి నాగులూరు గ్రామంలో జరుగుతున్న శివ పంచాయతనం, నవగ్రహ హనుమాన్ ధ్వజస్తంభం, బొడ్రాయి, ఊరడమ్మ, లింగమయ్య దేవతల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్‌యాదవ్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ చినంగి వెంకటేశం, స్థానిక వైస్ చైర్మన్ తుడుం పద్మారావు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- KP Vivekanand
- manner
- mla
- Phase
RELATED ARTICLES
తాజా వార్తలు
Malaria vaccine | మలేరియా టీకా ధరలు తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ..!
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

