Vintage Cars | చారిత్రక నగరంలో వింటేజ్ కార్లు..కనువిందు చేశాయి. 1938 చెందిన ఆస్టిన్, మోరీస్ గ్యారెజెస్, ఫోర్డ్, బెంజ్ మొదలుకొని మొన్నటి అంబాసిడర్ కాలం వరకు వివిధ వాహనాలు అబ్బురపరిచాయి. క్లాసిక్ మోటార్ వెహికిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘రైడ్ ఇన్ పార్క్’ పేరుతో వింటేజ్ కార్ల ర్యాలీని ఏర్పాటు చేశారు.
నెక్లెస్‌రోడ్‌లో ప్రారంభమైన ఈ ర్యాలీ సోమాజిగూడలోని ది పార్క్ హోటల్ వరకు కొనసాగింది. దారిపొడవునా అలనాటి వింటేజ్ వాహనాలను చూసి సందర్శకులు సంబురపడ్డారు. ఫొటోలు తీస్తూ, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
-ఖైరతాబాద్, మార్చి 10