Hyderabad | ఓ వ్యక్తి కిడ్నీలో 154 రాళ్లు.. శస్త్రచికిత్స విజయవంతం
Hyderabad | హైదరాబాద్ : ఓ వ్యక్తి కిడ్నీలో ఒకట్రెండు రాళ్లు కాదు.. ఏకంగా 154 రాళ్లు బయటపడ్డాయి. సికింద్రాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ హాస్పిటల్లోని యూరాలజిస్టులు ఆ వ్యక్తికి విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించి రాళ్లను తొలగించారు. బాధిత వ్యక్తి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది.
Hyderabad | హైదరాబాద్ : ఓ వ్యక్తి కిడ్నీలో ఒకట్రెండు రాళ్లు కాదు.. ఏకంగా 154 రాళ్లు బయటపడ్డాయి. సికింద్రాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ హాస్పిటల్లోని యూరాలజిస్టులు ఆ వ్యక్తికి విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించి రాళ్లను తొలగించారు. బాధిత వ్యక్తి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది.
వివరాల్లోకి వెళ్తే.. రామగుండం వాసి అయిన 45 ఏండ్ల వ్యక్తి.. గత కొంతకాలం నుంచి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతను ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ వైద్యులను సంప్రదించాడు. రోగికి సీటీ స్కాన్ పరీక్షలు నిర్వహించగా, రైట్ కిడ్నీలో అధిక మొత్తంలో రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇందులో ఒక రాయి 62 ఎంఎం, 39 ఎంఎం ఉన్నట్లు నిర్ధారించారు. ఎండోస్కోపి సర్జరీ నిర్వహించి మొదటగా ఆ రాయిని బ్లాస్ట్ చేశారు. అనంతరం మిగతా రాళ్లను తొలగించారు. మొత్తం ఆ రోగి కిడ్నీలో నుంచి 154 రాళ్లను తొలగించినట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ సందర్భంగా సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ రాఘవేంద్ర కులకర్ణి మాట్లాడారు. రోగికి షుగర్ లెవల్స్ కంట్రోల్లో లేవని తెలిపారు. ఇక కిడ్నీలో కూడా రాళ్లు ఉండటంతో ఇతర వ్యాధులు సంభవించే అవకాశం ఉంది. అంతే కాకుండా కిడ్నీకి గాయం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. డయాలసిస్ అవసరం కూడా ఏర్పడుతుంది. షుగర్ ఉన్న వారిలో ఇలాంటి పరిస్థితులు తీవ్ర ఇబ్బందులను కలగజేస్తాయి. కాబట్టి అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి, రోగి కుడి కిడ్నీలో నుంచి 154 రాళ్లను తొలగించినట్లు డాక్టర్ రాఘవేంద్ర పేర్కొన్నారు.
ఈ సర్జరీలో డాక్టర్ రాఘవేంద్ర కులకర్ణితో పాటు డాక్టర్ గోపాల్ రామ్దాస్ టాక్, డాక్టర్ సూరజ్ పిన్ని, అనస్థీషియా డాక్టర్ శ్రీనివాస్ పాలుపంచుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

