600 కేంద్రాల్లో ఉచిత మొక్కలు

సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి గృహాన్ని నందనవనంలా మార్చాలని అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అధికారులు సంకల్పించారు. హరితహారం ఏడో విడతలో భాగంగా కోటి మొక్కలు నాటడంతో పాటు ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పంపిణీ లక్ష్యంగా రంగంలోకి దిగారు. ఈ మేరకు ఎల్బీనగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, చార్మినార్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో మొత్తం 600 నర్సరీలను ఏర్పాటు చేశారు. వార్డు ఆఫీసులు, ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేసిన ఈ నర్సరీల్లో 25 లక్షల చొప్పున మొక్కలు సిద్ధం చేశారు. సోమవారం నుంచి ఒక్కొక్కరికీ ఆరు మొక్కలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. తులసీ, అశ్వగంధ, అల్లోవేరా, కలబంద, లెమన్గ్రాస్, లావెండర్, ఉసిరి, దానిమ్మ, నిమ్మ, వేప, జాస్మిన్, మందారం మొక్కలు ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని.. కావాల్సిన వారు www.ghmc.gov.inలో సంప్రదించవచ్చన్నారు. అధికంగా మొక్కలు కావాలనుకునే వారు తమ వివరాలను సంబంధిత అధికారులకు ఇవ్వాలని పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

