ఫలించిన బీఆర్ఎస్ సంకల్పం
మేడ్చల్ జిల్లాలోని కీసర సర్కిల్ పరిధిలోని యాద్గారిపల్లి అటవీ ప్రాంతంలో 146 హెక్టార్ల విస్తీర్ణంలో గండిచెరువు, పరిసరాలు విస్తరించి ఉన్నాయి.
- పర్యాటకులతో కిటకిటలాడుతున్న గండిచెరువు
- బీఆర్ఎస్ హయాంలో అండర్ ది మూన్ పేరుతో అభివృద్ధి
ఒకప్పుడు నగరానికి దూరంగా ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ తదితర ప్రాంతాలకు పరిమితమైన పచ్చని ప్రకృతిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నగరవాసుల దరి చేర్చింది. కాంక్రీట్ జంగిల్లో ఉండే నగర ప్రజలు ఆదివారం, సెలవు దినాల్లో ఆహ్లాదకరంగా గడిపేందుకు అటవీ వాతారణాన్ని నగరం చెంతకు తీసుకువచ్చింది. అటవీశాఖ ఆధ్వర్యంలో అర్బన్ లంగ్ స్పేస్ పార్కులను నగరం నలువైపులా రింగురోడ్డుకు సమీపంలో సృష్టించింది. అదే బాటలో నగర శివారులోని ప్రముఖ శైవక్షేత్రంగా ఉన్న కీసరకు సమీపంలో అటవీశాఖ ‘అండర్ ద మూన్’ పేరుతో అందమైన ప్రకృతిని ప్రకృతి ప్రేమికులకు అనువుగా మార్చింది.
మేడ్చల్, అక్టోబరు 25: మేడ్చల్ జిల్లాలోని కీసర సర్కిల్ పరిధిలోని యాద్గారిపల్లి అటవీ ప్రాంతంలో 146 హెక్టార్ల విస్తీర్ణంలో గండిచెరువు, పరిసరాలు విస్తరించి ఉన్నాయి. కీసర నుంచి దాదాపు 4 కిలో మీటర్ల దూరంలో గండి చెరువు ఉంది. దానికి అనుకుని కొండలు, గుట్టలు, యూకలిప్టస్ వనంతో అందమైన ప్రకృతి కొలువు తీరింది. ఒకప్పుడు కీసర-శామీర్‌పేట రహదారి పక్క నుంచి 3.5 కిలో మీటర్ల దూరంలో ఉన్న గండి చెరువు నిర్మానుష్య ప్రాంతంగా ఉండేది. ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో అసాంఘిక కార్యాలాపాలకు అడ్డాగా ఉండేది. మద్యం తాగడం, వ్యభిచారం, హత్యలు లాంటివి జరుగుతుండేవి. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు, ముగ్గురు మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రకృతి వినాశనం కూడా జరిగింది.
అటవీ శాఖ సంక..ల్పంతో.
బీఆర్ఎస్ హయాంలో అర్బన్ లంగ్ స్పేస్ పార్కులను అభివృద్ధి చేస్తున్న అటవీ శాఖ అధికారులు గండి చెరువు ప్రాంతంలో ప్రకృతి వినాశనం, అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకుని, పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. అండర్ ది మూన్ పేరుతో అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, తాగి పడేసిన మద్యం బాటిళ్లను ఏరిపారేశారు. నీలగిరి వనం వరకు వాహనాలు వెళ్లేందుకు రోడ్డును అభివృద్ధి చేశారు. గేట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను పారవేయకుండా, మద్యం తాగకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు. గండి చెరువుకు వచ్చే వారికి చార్జ్జి చేస్తూ లోపలికి అనుమతిస్తున్నారు.
ఇటీవల కాంగ్రెస్ సర్కార్ సర్టిఫైడ్ కంపెనీ గ్రిఫిన్ అనే అడ్వంచర్ సంస్థకు ఇక్కడి బాధ్యతలు అప్పగించింది. సంస్థ ప్రస్తుతం ఖాయకింగ్ను గండిచెరువులో నిర్వహిస్తుంది. దీంతో ప్రస్తుతం పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు కుటుంబ సమేతంగా వచ్చి, గండిచెరువు ప్రకృతి సోయగం విందును ఆరగిస్తున్నారు.
ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నాం
ప్రకృతి పరిరక్షణతో మానవ మనుగడ సాధ్యం పడుతుంది అన్న నినాదంతో గండిచెరువు ప్రాంతంలో ఎకో టూరిజాన్ని డెవలప్ చేస్తున్నాం. పోలీసు శాఖ సాయంతో అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకున్నాం. పర్యావరణ వినాశనం జరగకుండా కెమెరాలను ఏర్పాటు చేసి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం గండి చెరువులో ఖాయకింగ్ నిర్వహిస్తున్నాం. రూ.2 కోట్ల నిధులతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే జిప్‌లైన్, జిప్ సైక్లింగ్, కా ైక్లెంబింగ్ తదితర అడ్వంచర్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్నాం. పర్యాటకులకు ఇబ్బంది కల్గకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.
– విష్ణువర్దన్, ఫారెస్ట్ రేంజ్ అధికారి, కీసర
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- BRS
- keesara
- Nature
- Under the Moon
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

