గులాబీ తీర్మానాల్లో..నగరాభివృద్ధికి స్థానం

రాష్ర్టానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ మహానగర అభివృద్ధికి సీఎం కేసీఆర్,
టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది ఏడేండ్లలో అన్ని రంగాల్లో హైదరాబాద్ అభివృద్ధిలో పరుగులు తీసింది. అందుకే సోమవారం టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఇరవయ్యేండ్ల పండుగ సందర్భంగా ప్రవేశపెట్టిన తీర్మానాల్లోనూ నగరాభివృద్ధికి అద్దం పట్టేలా స్థానం కల్పించారు.
ప్రధానంగా మౌలిక వసతుల కల్పన అనేది గత ఏడు సంవత్సరాల్లో కనీవినీ
ఎరుగని రీతిలో సాగిందనేది అక్షర సత్యం. అందులోని ప్రధానాంశాలు కొన్ని…
- హైదరాబాద్ నగరంలో రూ.858 కోట్లతో నాలాల మరమ్మతు పనులు. గండిపేట చెరువు నిర్మించి వంద సంవత్సరాలైనదున రూ.36.5 కోట్లతో చెరువు అభివృద్ధి. ఓఆర్ఆర్ చుట్టూ రూ.387 కోట్లతో సర్వీసు రోడ్ల విస్తరణ.
- అర్బన్ మిషన్ భగీరథలో భాగంగా రూ.5,378 కోట్లు, జీహెచ్ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీల్లో రూ.3,285 కోట్లతో ఇంటింటికీ
- తాగునీరు.
- రూ.4,700 కోట్లతో కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణం.
- రూ.1,450 కోట్లతో సుంకిశాల నుంచి మరో పైప్‌లైన్ నిర్మాణం.
- జీహెచ్ఎంసీ పరిధిలో చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేకంగా వాహనాలు.
- హైదరాబాద్ మురుగునీటి శుద్ధి కోసం రూ.3,866 కోట్లు.
- దక్షిణ భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తొలి నగరం హైదరాబాద్.
- మరో 35 మెగావాట్ల ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణ పనుల్లో పురోగతి.
- ఏడేండ్లలో హైదరాబాద్ పరిధిలో 1561 నర్సరీల ఏర్పాటు.
- హైదరాబాద్ చుట్టూ 1,66,000 ఎకరాల్లో అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటు.
- ప్రపంచ బ్యాంకు హైదరాబాద్ నగరాన్ని ఓడీఎఫ్ ఫ్లస్ ప్లస్‌గా గర్తింపుతో పాటు -ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు-2020.
- దేశంలో ఎక్కడాలేని విధంగా యానిమల్ కేర్ సెంటర్ల ఏర్పాటు. కోతులు, పందులు, కుక్కలు, తదితర వాటిని పట్టుకొని మానవీయ కోణంలో స్టెరిలైజేషన్.
- హైదరాబాద్ విశ్వ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఇప్పటికే 9 ఫ్లైఓవర్లు, 4 అండర్‌పాస్‌లు, 3ఆర్వోబీల నిర్మాణం పూర్తి. కరోనా సమయంలోనే రూ.2వేల కోట్ల విలువైన ఫ్లైఓవర్లు, 300 కిలోమీటర్ల రోడ్లు, 29 లింకు రోడ్ల నిర్మాణం పూర్తి.
దుర్గం చెరువు కేబుల్‌బ్రిడ్జి ఆసియాలోనే అతి పెద్ద కేబుల్ బ్రిడ్జిగా రికార్డు. ఈ బ్రిడ్జి ద్వారా ప్రజలకు దూరభారం తగ్గడంతో పాటు సాయంకాలం జనం సేదతీరే ఉల్లాస కేంద్రంగా వినియోగం.
హైదరాబాద్ నగరంలో అనంతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అవుటర్ రింగురోడ్డుకు అదనంగా రీజినల్ రింగు రోడ్డుకు తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం ఉన్న అవుటర్ రింగు రోడ్డుకు 30 కిలోమీటర్ల అవతల, 348 కిలోమీటర్ల పొడవున రీజనల్ రింగు రోడ్డు నిర్మాణం. తెలంగాణ అభివృద్ధికి కొత్త ఊపు ఇవ్వనుంది.
హైదరాబాద్ నగరం నలుదిక్కులా వైద్య సేవల విస్తరణ కోసం తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (టిమ్స్) అనే పేరుతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే నగరంలోని గచ్చిబౌలిలో మొదటి టిమ్స్ దవాఖాన ఏర్పాటు. ఎల్బీనగర్, అల్వాల్, సనత్నగర్ల్లో మరో మూడు టిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభం. ఇందు కోసం భూసేకరణ పనులు కూడా పూర్తయ్యాయి.
అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేదలకు రూ.5కే భోజనం అందిస్తుంది. ప్రస్తుతం 150 క్యాంటీన్లు, ప్రతిరోజూ 35వేల మందికి భోజనం అందిస్తున్నారు.
హైదరాబాద్‌లో పేదల కోసం ఇప్పటికే 226 బస్తీ దవాఖానల ఏర్పాటు.మరో 32 ప్రారంభానికి సిద్ధం. హైదరాబాద్‌లో ఒక్కో డివిజన్‌కు రెండు చొప్పున ఈ ఏడాది చివరికల్లా మొత్తం 300 బస్తీ దవాఖానల ఏర్పాటుకు నిర్ణయం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

