నేను కావాలని చేయలేదు
కేంద్ర మంత్రి అమిత్ షా నగర పర్యటన నేపథ్యంలో ఓ అనూహ్యమైన ఘటన చోటు చేసుకున్నది. బేగంపేటలోని హరిత ప్లాజా వద్ద మంత్రి కాన్వాయ్కి కారు అడ్డు రావడం కలకలం రేపింది.
- అమిత్ షా వస్తున్నట్లు తెలియదు..పోలీసులు కూడా చెప్పలేదు
- ఒక్కసారిగా హడావుడి చేసి అద్దాలు పగులగొట్టారు
- గోసుల శ్రీనివాస్ యాదవ్
సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి అమిత్ షా నగర పర్యటన నేపథ్యంలో ఓ అనూహ్యమైన ఘటన చోటు చేసుకున్నది. బేగంపేటలోని హరిత ప్లాజా వద్ద మంత్రి కాన్వాయ్కి కారు అడ్డు రావడం కలకలం రేపింది. అయితే ఈ ఘటనలో పోలీసులే హడావుడి చేయడం వల్ల తాను కారు ముందుకు పోనివ్వలేకపోయానని టీఆర్ఎస్ నేత, గొల్ల కురుమల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ మీడియాకు తెలిపారు. హరిత ప్లాజా వద్ద జరిగిన వాస్తవాలను పోలీసులకు వివరించానని చెప్పారు. మినర్వా హోటల్లో తరచూ కాఫీ తాగేందుకు వెళ్తుంటానని, శనివారం తాను వెళ్లే క్రమంలో అమిత్ షా వస్తున్నట్లు తెలియదని, పోలీసులు కూడా ముందుస్తుగా చెప్పి ఉంటే కారు తీసుకొని పోయేవాడిని కాదన్నారు. సుమారు 15మంది పోలీసులు తనను దుర్భాషలాడుతూ కారు అద్దాలు పగులగొట్టారని, ఆ సమయంలో రాజ్యాంగ బద్దంగా బాధ్యత గల పౌరుడిగా వ్యవహరించానని పేర్కొన్నారు. తనకు జరిగిన నష్టంపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

