ట్రాన్స్జండర్స్ కమ్యూనిటీ డెస్క్

దేశంలోనే మొదటిసారిగా సైబరాబాద్‌లో ప్రారంభం సీపీ వీసీ సజ్జనార్ శేరిలింగంపల్లి, మార్చి 6: దేశంలో ఎక్కడాలేని విధంగా మొదటిసారిగా ట్రాన్స్జండర్ల సమస్యల పరిష్కారానికి ట్రాన్స్జండర్స్ కమ్యూనిటీ డెస్క్ సైబరాబాద్‌లో అందుబాటులోకి తీసుకువచ్చామని సీపీ సజ్జనార్ తెలిపారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ), సైబరాబాద్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ట్రాన్స్జండర్స్ కమ్యూనిటీ డెస్క్’ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రూపొందించిన బ్రోచర్‌ను సీపీ అవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ట్రాన్స్‌జండర్లు సమాజంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, వివక్ష గురవు తూ, సమాజంలో చిన్నచూపునకు గురవుతున్నరన్నారు. సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నా వాటిని అందిపుచ్చుకోకపోవడం, సరైన అవగాహన లేకపోవడం లాంటి అనేక సమస్యలతో వారు సతమతమవుతున్నారన్నారు. అలాంటి వారందరికీ అండగా నిలిచేందుకు ఈ డెస్క్ ఉపయోగపడుతుందన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఈ తరహా డెస్క్‌ను ఏర్పాటుచేసిన ఘనత సైబరాబాద్ పోలీసులకు దక్కిందన్నారు. ట్రాన్స్‌జండర్లు డెస్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతిభా నైపుణ్యాల మేరకు ఉపాధి అవకాశాలు అందించనున్నట్లు తెలిపారు. సంఘవిద్రోహ పనులు, అసాంఘిక కార్యకలాపాలు మానుకోవాలన్నా రు. రంగారెడ్డి, మేడ్చల్ జేసీలు ప్రతీక్‌జైన్, విద్యాసాగర్ మాట్లాడుతూ ట్రాన్స్జండ ర్ల సంక్షేమానికి ఇది తొలి అడుగని అన్నా రు. పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా కృష్ణణ్, డీసీపీలు అనసూయ, వెంకటేశ్వ ర్లు, పద్మజా, విజయ్‌కుమార్, ప్రకాశ్‌రెడ్డి, ఎస్సీఎస్సీ ప్రతినిధి కృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

