ఆమెగా మారితే.. ఆదుకున్నారు

- అమ్మాయిలాగా మారాలనుకున్నాడు…
- తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.. ఇంట్లో నుంచి పరారీ
- హెల్ప్ డెస్క్ సహాయంతో తిరిగి ఇంటికి..
- కౌన్సెలింగ్‌తో యువతిగా మారిన బాలుడు
- ఆమెకు ఉద్యోగం కల్పించిన పోలీసులు
సమాజంలో ట్రాన్స్‌జెండర్స్‌కు ఓ గౌరవపదమైన పరిస్థితులను కల్పించేందుకు.. వారిని వేధించే పోకిరీల భర తం పట్టేందుకు సైబరాబాద్ పోలీసు అధికారులు ప్రారంభించిన ట్రాన్స్‌జెండర్ హెల్ప్ డెస్క్ మంచి ఫలితాలను సాధిస్తుంది. ఈ హెల్ప్ డెస్క్ ప్రారంభమైన 25 రోజుల్లో ఏడు ఫిర్యాదులను అందుకుంది. రెండు ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్లను నమో దు చేయగా.. మరో 5 ఫిర్యాదులపై కౌన్సెలింగ్ నిర్వహించి మందలించారు.
అమ్మాయిగా మారాలనుకుని..
గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన ఓ 10వ తరగతి బాలుడు అమ్మాయిలాగా మారాలనుకుని ఇంట్లో చెప్పకుండా ఎల్బీనగర్లోని ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో చేరాడు. ఇలా దాదాపు 3 నుంచి 4 సార్లు వెళ్లిపోయి తిరిగి పోలీసుల సహాయంతో ఇంటికి చేరుకున్నాడు. ఇటీవల ఇంట్లో ఎవరికీ చెప్పకుండా సిద్ధిపేటకు వెళ్లిపోయాడు. దీనిపై విద్యార్థి తండ్రి గచ్చిబౌలి పీఎస్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రంగంలోకి దిగిన ట్రాన్స్‌జెండర్ హెల్స్ డెస్క్ సిబ్బంది.. బాలుడిని సిద్ధిపేట నుంచి పట్టుకొచ్చి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చింది. చివరకు బాలుడు ట్రాన్స్‌జెండర్‌గా మారేందుకు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. దీంతో ఆ ట్రాన్స్‌జెండర్‌కు ఉద్యోగం కల్పించి.. గౌరవంగా బతకాలని పోలీసులు సూచించారు. ఏ ట్రాన్స్‌జెండర్ గ్రూపులో చేరకుండా ఉండాలని పోలీసులు తెలిపారు.
ట్రాన్స్జెండర్లు మర్యాదపూర్వకంగా జీవించాలని.. వారికి ఎవరి నుంచి అయినా వేధింపులు, ఇబ్బందులు ఉంటే వెంటనే ట్రాన్స్‌జెండర్ వాట్సాప్ నెం. 9490617121 లేదా డయల్ 100 లేదా గచ్చిబౌలిలోని ట్రాన్స్‌జెండర్ హెల్ప్ డెస్క్లేదాtransgender.cybsuprt121@gmail.com, ట్విటర్-@ TRAN SGENDERCyb2, ఇన్స్టాగ్రాం-transgendercybsupport, Facebook ID-Transgender Cyberabad Support లలో సంప్రదించాలని సైబరాబాద్ ఉన్నతాధికారులు కోరుతున్నారు. ప్రజలకు కూడా ట్రాన్స్ జెండర్ల నుంచి ఏమైన సమస్యలు ఉన్నా కూడా ఈ వేదికలపై ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. సైబరాబాద్ ట్రాన్స్‌జెండర్ హెల్ప్ డెస్క్ పని తీరును అభినందిస్తూ ట్రాన్స్జెండర్లు మెసేజ్‌లు పెట్టి ప్రశంసిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

