ఈ ఆదివారం హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ : ఈ నెల 28వ తేదీన(ఆదివారం) హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ నేపథ్యంలో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అవసరమైన చోట ఉదయం 4:30 నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లిస్తామని పేర్కొన్నారు.
-పంజాగుట్ట, రాజ్‌భవన్ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, నెక్లెస్ రోడ్డు వైపు వెళ్లే వాహనదారులు ఖైరతాబాద్ జంక్షన్, షాదాన్ కాలేజీ, నిరంకారి భవన్ నుంచి రవీంద్ర భారతి మీదుగా వెళ్లాలి.
-ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, షాదాన్ కాలేజీ నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వెళ్లే వాహనదారులు తాజ్ కృష్ణ, రోడ్ నంబర్ 10, 12, క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా జూబ్లీహిల్స్ చేరుకోవచ్చు.
-ఇక్బాల్ మీనార్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్‌కు వచ్చే వాహనాలను తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదుగా మళ్లిస్తారు.
-లిబర్టీ జంక్షన్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద దారి మళ్లిస్తారు. ఇక్బాల్ మీనార్ యూ టర్న్ నుంచి తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదుగా లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ టెంపుల్ మీదుగా వాహనాలను అనుమతిస్తారు.
-కవాడిగూడ క్రాస్‌రోడ్స్ నుంచి సెయిలింగ్ క్లబ్ వైపునకు వాహనాలను అనుమతించరు. మినిస్టర్ రోడ్డు నుంచి రాణిగంజ్ మధ్య కూడా వాహనాలను అనుమతించరు. నెక్లెస్ రోడ్డు వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ వద్దనే మళ్లిస్తారు.
-బేగంపేట నుంచి రాజ్‌భవన్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కు వెళ్లే వాహనాలను గ్రీన్ ల్యాండ్స్ జంక్షన్ నుంచి డీకే రోడ్ మీదుగా వాహనాలకు అనుమతిస్తారు. నాగార్జున సర్కిల్ నుంచి కేబీఆర్ పార్క్ వరకు ఉదయం 9 గంటల వరకు వాహనాలను నిలిపివేస్తారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

