తీస్తారా.. తీసేయమంటారా?
ప్రధాన, అంతర్గత రహదారులపై నెలల తరబడి తీయకుండా నిలిపి ఉంచిన వాహనాలను తరలించే ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న పాత, తుప్పుబట్టిన వాహనాలను తొలగించాలని ట్రాఫిక్ పోలీసులు వాటి యజమానులకు
రోడ్లపై తిష్టవేసిన పాత వాహనాల తొలగింపు
క్రేన్లతో పార్కింగ్ యార్డులకు తరలింపు
మొదటిరోజు 628 వాహనాలు స్వాధీనం
నగరవ్యాప్తంగా మరికొన్నిరోజులు స్పెషల్ డ్రైవ్
15 రోజుల్లో తిరిగి తీసుకెళ్లకుంటే బహిరంగ వేలంలో విక్రయం
ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్
ప్రధాన, అంతర్గత రహదారులపై నెలల తరబడి తీయకుండా నిలిపి ఉంచిన వాహనాలను తరలించే ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న పాత, తుప్పుబట్టిన వాహనాలను తొలగించాలని ట్రాఫిక్ పోలీసులు వాటి యజమానులకు 15రోజుల కిందట నోటీసులు ఇచ్చారు. కొందరు స్పందించగా, మరికొందరు పట్టించుకోకపోవడంతో నగరవ్యాప్తంగా క్రేన్ల సాయంతో వాహనాలను గోషామహల్ స్టేడియం, బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, కాచిగూడ, సైఫాబాద్ పోలీస్స్టేషన్ల ప్రాంగణాలకు తరలించారు. తొలిరోజు 628 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, 15 రోజుల్లో తిరిగి తీసుకెళ్లకుంటే బహిరంగ వేలంలో విక్రయిస్తామని నగర ట్రాఫిక్ జాయింట్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. మరికొన్నాళ్లు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని, వెంటనే రోడ్లపై వాహనాలను తొలగించాలని ఆయన సూచించారు.
రోడ్లపై రోజులు, నెలల తరబడి పార్కు చేసి వాటిని పట్టించుకోకుండా వదిలేసిన వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరఢా ఝులిపిస్తున్నారు. మంగళవారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రధాన రహదారులు, కాలనీలు, బస్తీలలోని రోడ్లలో ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగించే విధంగా పార్కు చేసిన 628 నాలుగు చక్రాల వాహనాలను క్రేన్ల సాయంతో పార్కింగ్ యార్డులకు తరలించారు. గోషామహల్ స్టేడియం, బేగంపేట్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, కాచిగూడ, సైఫాబాద్ పోలీస్స్టేషన్ల ప్రాంగణాలకు తరలించి పార్కు చేశారు. 15 రోజుల కిందట ఆయా వాహనాలకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న వారిలో కొందరు తమ వాహనాలను సొంత పార్కింగ్ స్థలాలకు తరలించారు. మరికొందరు నోటీసులను పట్టించుకోలేదు. దీంతో పోలీసులు ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించే విధంగా పార్కింగ్ చేసిన పాత వాహనాలను పార్కింగ్ యార్డులకు తరలించారు. పార్కింగ్ యార్డులకు తరలించిన వాహనాలు తిరిగి తెచ్చుకోవాలంటే, క్రేన్ల సాయంతోనే తెచ్చువాలి. అందుకు వాహనదారులకు ఖర్చవుతుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రోడ్లపై నుంచి వాహనాలను తొలగించాలని పోలీసులు సూచిస్తున్నారు.
మీ పాత వాహనాలను రోడ్డు పక్కన, ఇంటిముందు పార్కు చేసి వదిలేశారా..? తప్పు పట్టినా పట్టించుకోవడంలేదా..? ఇప్పుడు ఇలాంటి వాహనాలపై పోలీసులు దృష్టి సారించారు. ముందుగా నోటీసులు ఇచ్చి.. రెండు రోజుల్లోనే ఆయా వాహనాలను యార్డుకు తరలిస్తారు. నిర్లక్ష్యం చేస్తే వేలంద్వారా విక్రయిస్తారు. వాటిని తెచ్చుకోవాలంటే తలకుమించిన భారమే. వెంటనే స్పందించండి. రోడ్లపై పార్కుచేసిన వాహనాలను మీరే తొలగించుకోండి. – సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ)
పట్టించుకోపోతే వేలం
కదలలేని స్థితిలో ఉన్న వాహనాలను చాలా వరకు రోడ్లపైనే పార్కు చేసి వదిలేశారు. అలాంటి వాటిని తొలగిస్తున్నాం. ఇప్పటికే 2500 నోటీసులు తయారు చేశాం. మంగళవారం ఒక్క రోజు 628 పాత వాహనాలను యార్డులకు తరలించాం. ఈ వాహనాల సంబంధిత యజమానులు 15 రోజుల్లో తీసుకువెళ్లాలి. నిర్ణీత సమయంలో వాహనదారులు రాకపోతే 39బి సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం బహిరంగ వేలంలో విక్రయిస్తాం. – ట్రాఫిక్ జాయింట్ సీపీ, ఏవీ రంగనాథ్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

