GHMC | సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36.8డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.9డిగ్రీలు, గాలిలో తేమ 31శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.