హైదరాబాద్ : నగర శివారు బ్రాహ్మణపల్లి(Brahmanapalli) ఔటర్ రింగురోడ్డు(Outer Ring Road) సమీపంలో ఓ మూటలో లభించిన మృతదేహం (Dead body) స్థానికంగా కలకలం రేపింది. గోనె సంచిలో మృతదేహాన్ని మూటకట్టి గుర్తుతెలియని వ్యక్తులు ఓఅర్అర్ పై నుంచి కిందకి పడేశారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాప్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.