బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఘనంగా హిందీ దివాస్

సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 ( నమస్తే తెలంగాణ ) : తెలంగాణ సౌత్ రీజన్- బ్యాంక్ ఆఫ్ బరోడా రీజనల్ కార్యాలయంలో హిందీ దివాస్ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్రం జారీ చేసిన రాజ్య భాష ప్రతిజ్ఞను ఉద్యోగులు, సిబ్బంది ఆలపించారు. ఈ సందర్భంగా తెలంగాణ సౌత్ రీజనల్ హెడ్ కె. విజయరాజు మాట్లాడుతూ.. కార్యాలయాల్లో వీలైనంతగా హిందీ భాష వినియోగాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. రోజువారీ కార్యకలాపాలను హిందీలోనే నిక్షిప్త పరిచేలా చూడాలని కోరారు. హిందీలోనే కార్యాలయ పనులు నిర్వర్తించడంతో హిందీ ప్రాధాన్యతను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యానికి దోహదపడినవారమవుతామని అన్నారు. అనంతరం హిందీ దివాస్ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. హిందీ దివాస్ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇచ్చిన సందేశాన్ని సీనియర్ మేనేజర్ జి. విజయ్ కుమార్ చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ టీవీవీఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

