HYDRAA | నగరం నడిబొడ్డున చెరువును పూడ్చేస్తున్నారు.. హైడ్రాకు కనిపించడం లేదా..?
HYDRAA | చెరువులు, కుంటల పరిరక్షణే లక్ష్యం అంటూ పేదలు నివాసం ఉంటున్న బస్తీలు, కాలనీల్లో హల్చల్ చేస్తున్న హైడ్రా అధికారులు నగరం నడిబొడ్డున చెరువును అడ్డగోలుగా పూడ్చేస్తుంటే చోధ్యం చూస్తున్నారా..? అంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
HYDRAA | బంజారాహిల్స్, మార్చి 5 : చెరువులు, కుంటల పరిరక్షణే లక్ష్యం అంటూ పేదలు నివాసం ఉంటున్న బస్తీలు, కాలనీల్లో హల్చల్ చేస్తున్న హైడ్రా అధికారులు నగరం నడిబొడ్డున చెరువును అడ్డగోలుగా పూడ్చేస్తుంటే చోధ్యం చూస్తున్నారా..? శివారు ప్రాంతాల్లోనే తప్ప నగరం మధ్యన ఉన్న చెరువుల్లో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు జరుగుతుంటే పట్టించుకోరా..? అంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నెం 1లోని తాజ్ బంజారా చెరువును గతంలో హమీద్కుంట అని పిలిచేవారు. గుండ్ల చెరువుగా రెవెన్యూ రికార్డుల్లో ఉండే ఈ చెరువు చుట్టూ ఆక్రమణలు రాకుండా చూడడంతో పాటు వాకర్ల కోసం గత ప్రభుత్వ హయాంలో 900 మీటర్ల మేర వాకింగ్ ట్రాక్ నిర్మాణాన్ని చేపట్టారు. కాగా ఇటీవల బంజారాహిల్స్ రోడ్ నెం 1లోని శివాలయం పక్కన జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మొక్కలు నాటి పార్కుగా ఏర్పాటుచేశారు. అయితే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు చెరువులోని స్థలంలోకి చొచ్చుకుని వెళ్లి నిర్మాణ వ్యర్థాలు నింపి సుమారు 500 గజాల మేర చెరువును పూడ్చివేశారు. పదుల సంఖ్యంలో ట్రిప్పర్లతో భవన నిర్మాణ వ్యర్థాలు తీసుకువచ్చి చెరువులో పోయడంతో అసలే కబ్జాలతో నిండిపోయిన తాజ్ బంజారా చెరువు మరింత కుంచించుకపోయింది.
జీహెచ్ఎంసీ పేరుతో సాగుతున్న చెరువు పూడ్చివేత వెనక స్థానికంగా ఉన్న కొంతమంది వ్యక్తుల హస్తం ఉందని, తమ గేదెలను, ఆవులను పూడ్చివేసిన స్థలంలో ఉంచేందుకే ఈ పనిచేశారని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు చెరువు ప్రారంభంలో సైతం అంబేద్కర్‌నగర్ బస్తీవైపు నాలాను అనుకుని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు చెరువులో మట్టి డంపింగ్ చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుటు లేక్ వ్యూ బంజారా ఫంక్షన్ హాల్‌తో పాటు మరికొన్నినిర్మాణాల్లో కొంత భాగంగా తాజ్ బంజారా చెరువు బఫర్ జోన్లో ఉన్నాయని రెవెన్యూ, నీటి పారుదలశాఖ అధికారులు గుర్తించి వారికి నోటీసులు జారీ చేశారు.
అయితే ఇటీవల వారు సైతం చెరువులో వ్యర్థాలను పారవేస్తూ కాలుష్యానికి కారణంగా మారుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగి తాజ్ బంజారా చెరువులో వ్యర్థాలను తొలగించాలని, చెరువును పూడ్చిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా తాజ్ బంజారా చెరువులోకి ఇష్టారాజ్యంగా డ్రైనేజీ నీరు వదులుతుండడంతో చెరువుమొత్తం కాలుష్య కాసారంగా మారింది. డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో మురుగునీటితో పాటు తీవ్రమైన దుర్వాసనలు వెదజల్లుతున్న తాజ్ బంజారా చెరువును శుభ్రం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

