సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : హెల్త్‌కేర్(Healthcare) రంగంలోని స్టార్టప్‌ల(Startups)కు ప్రోత్సాహించేందుకు టీ హబ్(T Hub), ఆవిష్కరణ ఇంక్యుబేటర్లు కలిసి పని చేయనున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య,ఆరోగ్యం రంగంలోనూ సరికొత్త ఆవిష్కరణలను చేసేలా ఔత్సాహిక స్టార్టప్ వ్యవస్థాపకులకు మద్దతు ఇచ్చేందుకు టీహబ్‌తో నైపర్ హైదరాబాద్ విద్యా సంస్థలోని ఆవిష్కరణ్ ఇంక్యుబేటర్‌తో కలిసి పనిచేస్తోంది.
కార్యక్రమంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, సాస్ డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్స్, హెల్త్‌కేర్, ఫార్మా, బయోటెక్నాలజీ వంటి అంశాలపై స్టార్టప్‌లను ప్రోత్సహించనున్నామని టీ హబ్ ప్రతినిధి తెలిపారు. ఫిబ్రవరి 15వ తేదీ లోగా ఈ కింది లింకు ద్వారా ( https://bit.ly/3S4ElrG) దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.