ఎస్పీ బాలుకు చిన్నారుల స్వర నీరాజనం

తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 30: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అమెరికాలోని తెలుగు పిల్ల లు స్వర మాధుర్యంతో తెలుగు భాషా మాధుర్యాన్ని సంగీత ప్రియులకు పంచుతూ గానం చేయడం ఆనందంగా ఉందని హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఏ.రామలింగేశ్వరరావు అన్నారు. యువ కళావాహిని, బాలనాద వినోదం(యుఎస్ఏ) సంయుక్త ఆధ్వర్యం లో సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ సౌజన్యంతో నాద వినోద మ్యూజిక్ అకాడమీ విద్యార్థులచే, అంతర్జాలం వేదికగా ఎస్పీ బాలు స్వర నీరాజనం కార్యక్ర మం కొనసాగింది. నాద వినోదం మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు మణి శాస్త్రి, ఫ్యాకల్టీ సభ్యులు డాక్టర్ అంజనీ ప్రసాద్ల పర్యవేక్షణలో సాగిన సంగీత విభావరిలో చిన్నారులు పలు తెలుగు పాటలను ఆలపించి బాలుకు స్వర నీరాజం సమర్పించారు. ప్రఖ్యా త సినీ సంగీత దర్శకులు కోటి పాల్గొని పిల్లలకు శృతి విషయంలో మెలకువలు నేర్పించారు. సినీ గేయ రచయిత సిరాశ్రీ మాట్లాడుతూ స్వరం దేవుడు ఇచ్చిన వరంగా చెప్పారు. కార్యక్రమంలో యువ కళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

