అక్రమాలకు పాల్పడితే సహించేది లేదు
‘పోలీసు అధికారులు, సిబ్బంది, ఫిర్యాదుదారుల పట్ల పారదర్శకంగా వ్యవహరించాలి. చట్ట ప్రకారం నడుచుకోవాలి. చట్టాలను అమలు చేయాల్సిన పోలీసులే వాటిని ఉల్లంఘిస్తే ఎలా...ప్రజలకు న్యాయం చేసినప్పుడే వారికి పోలీసులంటే నమ్మకం పెరుగుతుంది.
- స్థానిక పోలీస్స్టేషన్లలో న్యాయం జరగకపోతే
- బాధితులు నేరుగా సీపీకి ఫిర్యాదు చేయొచ్చు
- డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాం
- నమస్తేతో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి
సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ‘పోలీసు అధికారులు, సిబ్బంది, ఫిర్యాదుదారుల పట్ల పారదర్శకంగా వ్యవహరించాలి. చట్ట ప్రకారం నడుచుకోవాలి. చట్టాలను అమలు చేయాల్సిన పోలీసులే వాటిని ఉల్లంఘిస్తే ఎలా…ప్రజలకు న్యాయం చేసినప్పుడే వారికి పోలీసులంటే నమ్మకం పెరుగుతుంది. సిబ్బందిగాని అధికారులు గాని ఏ స్థాయివారైనా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా.. అవకతవకలకు పాల్పడినా.. ఏకపక్షంగా వ్యవహరించినా ఉపేక్షించేది లేదు.
అలాంటి వారిపై కఠినంగానే వ్యవహరిస్తాం. శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం’. అని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి హెచ్చరించారు. సైబరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టి నెలరోజులు పూర్తయిన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. అవేమిటో ఆయన మాటల్లోనే..
సాంకేతిక పరిజ్ఞానంతో..
విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేశాం. సాంకేతిక పరిజ్ఞానంతో నేర పరిశోధన, నివారణ చర్యలు చేపడుతున్నాం. ఐటీ, టెక్నికల్, లా ఎక్స్పర్ట్ సహకారంతో సైబర్‌క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలను ఛేదిస్తున్నారు. ఒక జనవరిలోనే 40 సైబర్‌క్రైమ్ కేసులు ఛేదించి సుమారు రూ.1,49,41,670 మొత్తాన్ని నేరస్తుల నుంచి రికవరీ చేసి, బాధితుల ఖాతాల్లో జమ చేశాం. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి.
డ్రగ్స్ నివారణపై ప్రత్యేక దృష్టి
కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ వినియోగం, విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం . మత్తు పదార్థాలు గ్రాము పరిమాణంలో లభించినా కఠినంగానే వ్యవహరిస్తాం. ముఖ్యంగా డ్రగ్స్ వల్ల యువత చెడుదారిపడుతున్నది. అందుకే మాదకద్రవ్యాల నివారణ కోసం స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్వోటీ) ప్రత్యేకంగా పనిచేస్తున్నది.
అధికారులు స్పందించకపోతే..
స్థానిక పోలీస్ స్టేషన్లలో అధికారులు స్పందించకపోతే ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయాలి. వారి నుంచి కూడా న్యాయం జరగకపోతే బాధితులు నేరుగా సీపీకి ఫిర్యాదు చేయవచ్చు. స్థానిక అధికారులను సంప్రదించకుండా నేరుగా సీపీ కార్యాలయానికి రావొద్దు. కిందిస్థాయి, మధ్యస్థాయి అధికారుల వద్ద సమస్య తీరనప్పుడు సీపీని సంప్రదించాలి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

