డ్రగ్స్ పార్టీపై ఎస్వోటీ దాడి
నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. గచ్చిబౌలిలోని ఓ కోలివింగ్ గెస్ట్ రూమ్‌లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై ఎస్ఓటీ దాడి చేసి బహిర్గతం చేసింది. రాత్రి వేళలో యువతీయువకులు డ్రగ్స్ మత్తులో మునిగిపోయి పార్టీ చేసుకుంటుండగా పోలీసులు దాడి చేశారు.
- గచ్చిబౌలిలో కోలివింగ్ గెస్ట్ రూమ్‌లో మత్తులో మునిగిన యువతీయువకులు
- భారీగా డ్రగ్స్ స్వాధీనం.. 13 మంది అరెస్ట్
శేరిలింగంపల్లి, నవంబర్ 4(నమస్తే తెలంగాణ): నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. గచ్చిబౌలిలోని ఓ కోలివింగ్ గెస్ట్ రూమ్‌లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై ఎస్ఓటీ దాడి చేసి బహిర్గతం చేసింది. రాత్రి వేళలో యువతీయువకులు డ్రగ్స్ మత్తులో మునిగిపోయి పార్టీ చేసుకుంటుండగా పోలీసులు దాడి చేశారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో కీలక వివరాలు బయటపడ్డాయి. కర్ణాటక రాష్ట్రం నుంచి డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేసి హైదరాబాద్‌లోని యువతీయువకులకు సరఫరా చేస్తున్న గుత్తా తేజకృష్ణ అనే ప్రధాన స్మగ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు డ్రగ్స్ సరఫరాలో పాలుపంచుకున్న నైజీరియన్ పౌరుడు కూడా అరెస్టయ్యాడు.
పీజీ హాస్టల్ కేంద్రంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో అడిషనల్ డీసీపీ ఎన్.ఉదయ్‌రెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 3వ తేదీన గచ్చిబౌలి టీఎన్జీవోకాలనీలో ఎంఎస్ లగ్జరీ కోలివింగ్ పీజీ హాస్టల్లో డ్రగ్ ఫెడ్లర్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు అక్కడికి చేరుకున్న మాదాపూర్ ఎస్వోటీ, గచ్చిబౌలి పోలీసులు దాడి చేయగా.. కడపకు చెందిన తేజకృష్ణ, ఐటీ ఉద్యోగి లోకేష్రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరి నుంచి కొంత ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిచ్చిన సమాచారం మేరకు మాదాపూర్‌లోని నైట్ ఐ హోటల్లో డ్రగ్ ఫెడ్లర్ వెన్నెల రవికిరణ్ అలియాస్ భాను, పెద్దమంతూర్ హర్షవర్ధన్ రెడ్డి, మన్నె ప్రశాంత్, సాజీర్ మతుంగార్లను అదుపులోకి తీసుకున్నారు.
ఈ రెండు ప్రాంతాల్లో రూ.2లక్షల విలువైన 32.14 గ్రాముల ఎండీఎంఏ, 4.67 గ్రాముల గంజాయి, 6 సెల్ఫోన్లు, రూ.10 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏడీసీపీ ఉదయ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆరుగురు నిందితులతోపాటు డ్రగ్స్ వినియోగదారులు పృథ్వీ, విష్ణువర్ధన్, కార్లపుడి ప్రెస్లీ సుజీత్, మేకల గౌతమ్, గుండెబోయిన నాగార్జున, గుంటక సతీష్‌రెడ్డిలను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల్లో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు కుడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
వీరికి డ్రగ్స్ సఫ్లయ్ చేసే ఇద్దరు ప్రదాన నైజీరియన్ నిందితులు, కన్జుమర్స్ వినయ్, లక్ష్మణ్, రిజ్వాన్, కార్తీక్, వంశీ, హర్ష తదితరులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పీజీ హాస్టల్స్, గెస్ట్‌హౌజ్ యజమానులకు అవగాహన కల్పిస్తున్నామని, డ్రగ్స్ విషయమై వెంటనే సమాచారం ఇవ్వాలని, హాస్టళ్లలో బసచేసేవారి కదలికలపై నిఘా వేయాలని సూచించామన్నారు. ఈకార్యక్రమంలో మాదాపూర్ ఏసీపీ శ్రీధర్, గచ్చిబౌలి సీఐ హబీబ్బుల్లాఖాన్, ఎస్వోటీ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి, డీఐ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Laxma Reddy | జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Nanna Kutty | ‘నాన్న కుట్టి’ సినిమా రివ్యూ.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ జర్నీ ఆకట్టుకుందా?
RBI Gold Reserves | ఏడాదిలో 165 టన్నుల బంగారం వెనక్కి తెచ్చిన ఆర్బీఐ.. భారత్ వ్యూహమేంటి?
Jagapathi Babu | పనివాళ్ళతో కలిసి భోజనం చేసిన జగపతిబాబు.. స్టార్డమ్ పక్కనపెట్టి మనసులు గెలుచుకుంటున్న విలన్!
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

