ఎన్యూమరేషన్ ఫారం ఇచ్చినా.. జాబితాలో చోటేది?
గ్రేటర్లో ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. బీఎల్ఓలు బాధ్యతారాహిత్యం కారణంగా వేలాది మంది తమ ఓటు హకును కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. ఓటర్లు సక్రమంగా ఎన్యుమరేషన్ పత్రాలు సమర్పించినప్పటికీ, వాటిని ఆన్ లైన్లో అప్ లోడ్ చేయడంలో బీఎల్ఓలు విఫలమవుతున్నారు. ఓటర్లు అన్ని రకాల ఆధారాలతో దరఖాస్తులు అందించినా, జాబితాలో పేర్లు మాయమవుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
- ప్రశ్నిస్తే కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని బీఎల్వోల ఉచిత సలహా
- ఇటీవల రాజకీయ పార్టీల సమావేశంలో అభ్యంతరాలు .. గందరగోళంగా మారిన సర్ కార్యక్రమం
సిటీబ్యూరో: గ్రేటర్లో ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. బీఎల్ఓలు బాధ్యతారాహిత్యం కారణంగా వేలాది మంది తమ ఓటు హకును కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. ఓటర్లు సక్రమంగా ఎన్యుమరేషన్ పత్రాలు సమర్పించినప్పటికీ, వాటిని ఆన్ లైన్లో అప్ లోడ్ చేయడంలో బీఎల్ఓలు విఫలమవుతున్నారు. ఓటర్లు అన్ని రకాల ఆధారాలతో దరఖాస్తులు అందించినా, జాబితాలో పేర్లు మాయమవుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
చిరునామాలు మారాయనే నెపంతో అర్హులైన ఓటర్లను సైతం ఏఎస్డీ ( గైర్హాజరు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, మరణించినవారు , డూప్లికేట్ ఓటర్లు )జాబితాలోకి చేర్చు ఇదేమిటని ప్రశ్నిస్తే మళ్లీ కొత్త ఓటరుగా ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటూ బీఎల్ఓలు ఉచిత సలహాలు ఇస్తున్నారని మలక్‌పేటకు చెందిన శ్రీనివాస్ తెలిపారు. కాగా గ్రేటర్లో సుమారు 10వేల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 38.94 లక్షల మంది ఓటర్లకు సంబంధించి నోటీసుల ప్రక్రియ కొనసాగుతున్నది. సుమారు 7.03 లక్షల మందికి నోటీసులు సిద్ధమైనప్పటికీ పంపిణీ జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. మరో 18 లక్షల మంది నుంచి నోటీసులకు సమాధానాలు రాలేదని చెబుతున్నారు.
కాగా, మలక్‌పేటలో ఒకే ఇంట్లో ఉన్న నలుగురు ఓటర్లలో ఇద్దరికి నోటీసులు పంపి, మిగిలిన ఇద్దరికి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. ఒకో పోలింగ్ బూత్ పరిధిలో సుమారు 300 మందికి పైగా ఓటర్లు ఇలాంటి సమస్యలను ఎదురొంటుండటం గమనార్హం. నోటీసులు అందిన వారు సరిగ్గా స్పందించలేదనే సాకుతో ఓట్లను పకన పెట్టేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనివల్ల అర్హులైన ఓటర్లు తమ వాదన వినిపించుకునే ప్రాథమిక అవకాశాన్ని కూడా కోల్పోతున్నారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిన యంత్రాంగమే ఈ విధంగా ఏకపక్షంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య సూత్రాలకే విరుద్ధమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

