జైలుకు వెళ్లొచ్చినా బుద్ధి మారలేదు
చెడు వ్యసనాలకు అలవాటుపడి వందుకు పైగా దొంగతనాలకు పాల్పడిన శంకర్ నాయక్ (32) అనే కరడుగట్టిన దొంగను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చిన 15 రోజుల్లో నాలుగు చోరీలు చేసి తన ప్రతిభ చాటుకున్నాడు. గతంలో పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపినా తన తీరు మార్చుకోలేదు.
- సెంచరీ చోరీల శంకర్ నాయక్ అరెస్ట్
- పీడీ యాక్టు నమోదైనా మారని వైనం
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 12: చెడు వ్యసనాలకు అలవాటుపడి వందుకు పైగా దొంగతనాలకు పాల్పడిన శంకర్ నాయక్ (32) అనే కరడుగట్టిన దొంగను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చిన 15 రోజుల్లో నాలుగు చోరీలు చేసి తన ప్రతిభ చాటుకున్నాడు. గతంలో పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపినా తన తీరు మార్చుకోలేదు. ఓయూ ఏసీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అడిషనల్ డీసీపీ నరసయ్య, సీఐ రాజేందర్‌తో కలిసి డీసీపీ డాక్టర్ బాలస్వామి వివరాలు వెల్లడించారు. నాగర్ కర్నూల్ జిల్లా వీపనగండ్ల మండలం తుమ్ముకుంట గ్రామం నాగర్లబండ తండాకు చెందిన రత్లావత్ శంకర్ నాయక్ గద్వాల్లో బీఫార్మసీ చదువుతుండగా.. ఓ హత్యాయత్నం కేసులో 2012లో జైలుకు వెళ్లివచ్చాడు.
జైలు నుంచి విడుదలైన అనంతరం మద్యం, సిగరెట్లు, గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడి, రాత్రుళ్లు బయట తిరిగేవాడు. అతడి జల్సాలకు తన సంపాదన సరిపోకపోవడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఎన్నో చోరీలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో రాజేశ్ రెడ్డి, రంగారావు, లియాజాఖాన్ తదితర పేర్లతో చలామణి అయ్యాడు. కాలనీలు, వివిధ ప్రాంతాల్లో పగలు తాళం వేసి ఉన్న ఇండ్లను గమనించి, రాత్రి సమయాల్లో ఐరన్ రాడ్ సాయంతో చాకచక్యంగా తలుపు తెరిచి దొంగతనానికి పాల్పడేవాడు. 2022 సెప్టెంబర్‌లో మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీకి పాల్పడి, పోలీసులకు చిక్కడంతో పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపారు. బయటకు వచ్చినా తిరిగి దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కడంతో మళ్లీ జైలు పాలయ్యాడు.
అలా పలుమార్లు జైలుకు వెళుతూ దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో గత నెలలో జైలు నుంచి విడుదలైన శంకర్ నాయక్ తన వైఖరిని మార్చుకోక 15 రోజుల వ్యవధిలో నాలుగు దొంగతనాలు చేశాడు. వాటిలో ఒకటి ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో కాగా, మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, పటాన్చెరువు పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు చొప్పున ఉండటం గమనార్హం. ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్సిగూడలో నివాసముండే రాంజీ తన కుటుంబంతో సహా ఈనెల 1న మేడ్చల్‌లోని బంధువుల నివాసానికి వెళ్లి, 2న తిరిగివచ్చే సమయానికి ఇళ్లు తాళం తీసి ఉండటంతో పాటు సామన్లన్నీ చిందరవందరగా పడి ఉండటం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంట్లోని 8 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు చోరీ జరిగిన విధానం, ఫింగర్ ప్రింట్లు సేకరించి శంకర్ నాయక్ నేరం చేశారని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో నిందితుడు బుధవారం ఉదయం ఎల్బీనగర్లో సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ తరలించి, విచారించగా తన నేరాలను ఒప్పుకున్నాడు. శంకర్ నాయక్ చోరీ విధానం చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. తాను చోరీ చేసిన ప్రదేశంలో అక్కడ దొంగతనం చేసిన వస్తువుల వివరాలను ఒక చీటీలో రాసి అక్కడ వదిలేవాడు.
చీటీ దొరకని పక్షంలో గోడపై వివరాలను రాసేవాడు. అంతేకాకుండా, అన్ని చోరీల వివరాలు, అక్కడ చోరీ చేసిన వస్తువుల వివరాలను డైరీలో ఎప్పటికప్పుడు పొందుపర్చడం గమనార్హం. గతంలో ఒక చోరీ చేసిన సమయంలో అక్కడ ఏమీ లభించకపోయినా ఐదు తులాల బంగారు ఆభరణాలు పోయాయని ఇంటి యజమాని ఫిర్యాదు చేయడం, పోలీసులు తన నుంచి రికవరీ చేయడంతో అప్పటి నుంచి ఈ అలవాటు చేసుకున్నానని శంకర్ నాయక్ చెప్పడం విశేషం. అతడి నుంచి 11 తులాల బంగారు ఆభరణాలు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపర్చనున్నట్లు చెప్పారు. నిందితుడిని పట్టుకున్న డీఎస్సై శ్రీనివాసరావు, ఎస్సై యాసిన్ షరీఫ్, ఏఎస్సై ఈశ్వర్, ఇతర పోలీసులకు డీసీపీ అభినందించి రివార్డు అందజేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

