అయస్కాంత యంత్రం.. కష్టాలకు అంతం

- సీవరేజీ సమస్యకు మ్యాగ్నటిక్ సెన్సార్‌తో చెక్
- మూసుకుపోయిన మ్యాన్‌హోల్స్ గుర్తింపు
- యూసుఫ్‌గూడ సర్కిల్లో పనులు ప్రారంభం
మ్యాన్‌హోల్ మూసుకుపోయి.. రోడ్లపైకి మురుగునీరు పరుగులు పెట్టడం అప్పుడప్పుడూ నగరంలో చూస్తుంటాం. చాలా సందర్భాల్లో బీటీ రోడ్ల కింద ఇలా కనిపించకుండా పోయిన మ్యాన్‌హోళ్లను గుర్తించడం ఎంతో కష్టతరంగా మారుతున్నది. ఈ సమస్యను పరిష్కరిచేందుకు బల్దియా ఇజ్రాయెల్ నుంచి కొత్త యంత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. మ్యాగ్నటిక్ సెన్సార్‌తో పనిచేసే ఈ డిటెక్టర్ వల్ల మురుగు సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభించనున్నది. బీటీ రోడ్ల కింద మూసుకుపోయిన మ్యాన్‌హోళ్లను గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. మ్యాన్‌హోల్ మరమ్మతుల్లో సివరేజీ సిబ్బంది ఇబ్బందులకు మ్యాగ్నటిక్ సెన్సార్‌తో చెక్ పెట్టనున్నారు. మ్యాన్‌హోళ్ల నుంచి డ్రైనేజీ నీరు రోడ్లపైకి రాకుండా జలమండలి అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోనున్నారు. మురుగు పరుగుతో వాహనదారులు, పాదచారులకు అసౌకర్యం కలుగకుండా జలమండలి అధికారులు ఈ ఆధునిక యంత్రాలను ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ మేరకు జలమండలి అధికారులు గురువారం యూసుఫ్‌గూడలో సంబంధిత మిషన్‌తో పనులు ప్రారంభించారు. ఆయా పనులను జలమండలి డివిజన్-6 జనరల్ మేనేజర్ హరిశంకర్, డిప్యూటీ జనరల్ మేనేజర్లు, సెక్షన్ మేనేజర్లతో కలిసి పర్యవేక్షించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Sewerage Board
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

