యువతకు అండగా సెట్విన్ కేంద్రాలు
సెట్విన్ కేంద్రాల్లో నిర్వహిస్తున్న స్వయం ఉపాధి శిక్షణ తరగతులు నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్నాయి. నామమాత్రపు ఫీజుతో నాణ్యమైన శిక్షణను అందిస్తున్న సెట్విన్ కేంద్రాలు పేద విద్యార్థులకు ఉపాధి కల్పతరువుగా మారుతున్నాయి. యూసుఫ్‌గూడ సెట్విన్ కేంద్రంలో ఆయా కోర్సుల్లో కొత్త బ్యాచ్‌లకు శిక్షణ కార్యక్రమాలను
నామమాత్రపు ఫీజు.. ఉత్తమ శిక్షణ
యూసుఫ్‌గూడలో కొత్త బ్యాచ్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
నేటి నుంచి అడ్మిషన్లు షురూ
జూబ్లీహిల్స్,మే31: సెట్విన్ కేంద్రాల్లో నిర్వహిస్తున్న స్వయం ఉపాధి శిక్షణ తరగతులు నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్నాయి. నామమాత్రపు ఫీజుతో నాణ్యమైన శిక్షణను అందిస్తున్న సెట్విన్ కేంద్రాలు పేద విద్యార్థులకు ఉపాధి కల్పతరువుగా మారుతున్నాయి. యూసుఫ్‌గూడ సెట్విన్ కేంద్రంలో ఆయా కోర్సుల్లో కొత్త బ్యాచ్‌లకు శిక్షణ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. పాత బ్యాచ్ అభ్యర్థులకు పరీక్షలు పూర్తికావడంతో కొత్త బ్యాచ్‌లకు అడ్మిషన్లు స్వీకరిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆఫ్‌లైన్ శిక్షణలకు కొంత అంతరాయం ఏర్పడటంతో గతేడాది పునః ప్రారంభించిన ఈ కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ ఉపాధి రంగాల్లో శిక్షణ అందించేందుకు స్వల్పకాలిక కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యూసుఫ్‌గూడ సెట్విన్ సెంటర్ కోఆర్డినేటర్ ఆరుట్ల పారిజాతం తెలిపారు.
పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులతో పాటు కనీస విద్యార్హత ఉన్న అభ్యర్థులు నేరుగా సెట్విన్ కేంద్రంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. పదో తరగతి పాస్/ఫెయిల్ అయిన మహిళల కోసం 3 నెలల వ్యవధిలో 4 సెమిస్టర్లలో ఉపాధి శిక్షణ కోర్సులు నిర్వహిస్తున్నారు. సెమిస్టర్-1 లో గార్మెంట్ మేకింగ్, సెమిస్టర్-2 లో ప్యాషన్ డిజైనింగ్, సెమిస్టర్-3 లో అడ్వాన్స్డ్ ఫ్యాషన్ డిజైనింగ్, సెమిస్టర్-4 లో టెక్స్టైల్ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఇంటర్ పాస్/ఫెయిల్ అయిన యువతీ యువకుల కోసం ఆరు నెలల వ్యవధిలో డీఐపీడీఈ కోర్సులను, మూడు నెలల వ్యవధిలో సీ ప్లస్ కోర్సులను నిర్వహిస్తున్నారు. పదో తరగతి పా స్/ఫెయిల్ అయిన యువతీ యువకుల కోసం మూడు నెలల వ్యవధిలో ఎంఎస్ ఆఫీస్, డీటీపీ, సీసీఏ కోర్సులను నిర్వహిస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
కొత్త బ్యాచ్‌లకు శిక్షణ కోసం అడ్మిషన్లు స్వీకరిస్తున్నాం. జూన్ 1 నుంచి 10 వరకు అన్ని కోర్సులకు అడ్మిషన్లు తీసుకుంటున్నాం. ఆసక్తి గల అభ్యర్థులు కృష్ణానగర్‌లోని సెట్విన్ కార్యాలయంలో వెంటనే సం ప్రదించాలి. నామమాత్రపు ఫీజులతో అందిస్తున్న ఈ కోర్సులను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలి. వివరాల కోసం సెట్విన్ సెంటర్ కోఆర్డినేటర్, 82470 66835 ఫోన్ నంబర్లో సంప్రదించాలి.
–పారిజాతం, సెట్విన్ సెంటర్ కో ఆర్డినేటర్, యూసుఫ్‌గూడ
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Provide
- setwin
- skill training
- youth
RELATED ARTICLES
తాజా వార్తలు
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

