టాలీవుడ్లో కేపీ కలకలం
డ్రగ్స్ కేసులో పట్టుబడిన కబాలి సినీ నిర్మాత కేపీ చౌదరి పోలీసుల విచారణలో పలు కీలక అంశాలు వెల్లడించినట్లు తెలిసింది. ముఖ్యంగా 12 మందికి డ్రగ్స్ విక్రయించినట్లు విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. అంతే కాకుండా.. బిగ్‌బాస్‌లో పాల్గొన్న ఒక హీరోయిన్‌తో పాటు టాలీవుడ్లో ఐటమ్ సాంగ్ చేసిన మరో హీరోయిన్‌కు కూడా నిందితుడు డ్రగ్ సరఫరా చేసినట్లు విచారణలో అంగీకరించినట్లు సమాచారం.
- 12మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడి..?
- 11 అనుమానాస్పద లావాదేవీలపై పోలీసుల నిఘా
- కాల్ లిస్ట్‌ను డీకోడ్ చేస్తున్న అధికారులు
సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ కేసులో పట్టుబడిన కబాలి సినీ నిర్మాత కేపీ చౌదరి పోలీసుల విచారణలో పలు కీలక అంశాలు వెల్లడించినట్లు తెలిసింది. ముఖ్యంగా 12 మందికి డ్రగ్స్ విక్రయించినట్లు విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. అంతే కాకుండా.. బిగ్‌బాస్‌లో పాల్గొన్న ఒక హీరోయిన్‌తో పాటు టాలీవుడ్లో ఐటమ్ సాంగ్ చేసిన మరో హీరోయిన్‌కు కూడా నిందితుడు డ్రగ్ సరఫరా చేసినట్లు విచారణలో అంగీకరించినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసు విచారణ వివరాలు ఇలా ఉన్నాయి. 11 మందితో అనుమానాస్పద బ్యాంక్ లావాదేవీలు జరిపాడు. ఆ లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఒక పబ్ యజమానితో కూడా ఎక్కువ సార్లు మాట్లాడినట్టు గుర్తించారు. మరింత సమాచారం రాబట్టేందుకు చౌదరికి సంబంధించిన కాల్స్‌ను పోలీసులు దర్యాప్తులో భాగంగా డీకోడ్ చేస్తున్నారు.
సినీ పరిశ్రమంతో పాటు కొందరు వ్యాపారులు, నాయకుల పిల్లలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు కేపీ చౌదరి పోలీసు విచారణలో వెల్లడించినట్లు వస్తున్న వార్తలతో టాలీవుడ్లో కలకలం మొదలైంది. డ్రగ్స్ కేసులో ఈనెల 14న అరెస్టయిన చౌదరిని ఈనెల 21న కోర్టు అనుమతితో రాజేంద్రనగర్ పోలీసులు కస్టడిలోకి తీసుకున్న విషయం తెలిసిందే. కస్టడిలో భాగంగా పోలీసులు జరిపిన విచారణలో నిందితుడు పైవిషయాలను వెల్లడించినట్లు తెలిసింది. అయితే, పోలీసులు మాత్రం ఈ విషయాలను ధ్రువీకరించడంలేదు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

