RTC | విద్యార్థుల స్కూల్ టైమింగ్స్‌కు అనుగుణంగా బస్సులు నడుపాలి : ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి
వేసవి సెలవుల అనంతరం రేపటి (జూన్ 15 సోమవారం) నుండి రాష్ట్రవ్యాప్తంగా 2026-27 విద్యాసంవత్సరానికి గాను పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ
హైదరాబాద్ : వేసవి సెలవుల అనంతరం రేపటి (జూన్ 15 సోమవారం) నుండి రాష్ట్రవ్యాప్తంగా 2026-27 విద్యాసంవత్సరానికి గాను పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా అన్ని రూట్లలో తగినన్ని స్కూల్ బస్సులను నడపాలని టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి అన్ని రీజియన్ల అధికారులను ఆదేశించారు. నూతన విద్యాసంవత్సరంలో మొత్తం 227 పనిదినాలు ఉన్నందున, విద్యార్థులు సకాలంలో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా రవాణా సౌకర్యాలను సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని రీజియన్ల అధికారులు, డిపో మేనేజర్లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి రవాణా ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఎండీ సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల స్కూల్ టైమింగ్స్‌కు అనుగుణంగా బస్సు సర్వీసులను క్రమబద్ధీకరించాలని, గతంలో నడిపిన అన్ని స్కూల్ రూట్లను విధిగా పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. విద్యార్థులు బస్సుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా, ఉదయం, సాయంత్రం వేళల్లో ఖచ్చితమైన సమయ పాలన పాటించాలని, అవసరమైన చోట అదనపు ట్రిప్పులు నడపాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఎండీ నాగిరెడ్డి ఆదేశించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
Anant Singh expelled | ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను.. పార్టీ నుంచి బహిష్కరించిన జేడీ(యూ)
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

